‘రెవెన్యూ’ భూ మాయ

5 May, 2015 00:50 IST|Sakshi
‘రెవెన్యూ’ భూ మాయ

న్యూశాయంపేటలో రూ.కోట్ల భూమి ధారాదత్తం
స్ట్రైకింగ్ ఫోర్స్, ఏడీ నివేదికలిచ్చినా పట్టని వైనం
భూములను పరిశీలించిన జేసీ ప్రశాంత్ పాటిల్
ఆర్‌ఐ, వీఆర్వో సస్పెన్షన్‌కు ఆదేశం
సెలవులో ఉన్న తహసీల్దార్‌కు చార్జ్ మెమో!

 
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు బరితెగిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ‘రియల్’ వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు కాపాడేందుకు కలెక్టర్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి సర్వే  చేయిస్తున్నా క్షేత్రస్థాయిలో వీఆర్‌వో, ఆర్‌ఐలకు ప ట్టడం లేదు. ఈ విషయం గమనించిన జేసీ ప్రశాంత్ పాటిల్ అక్రమార్కుల భరతం పట్టేందకు రంగంలో కి దిగారు. శనివారం న్యూ శాయంపేటలోని ప్రభు త్వ భూములు సర్వే లాండ్ రికార్డ్స్ ఏడీ, వరంగల్ ఆర్డీవోతో కలిసి సందర్శించారు. సరిగ్గా జేసీ వచ్చిన సమయంలో ప్రభుత్వ భూమి నుంచి కొందరు ప్రైవే టు వ్యక్తులు రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. దీంతో త హసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వోలపై మండి పడ్డారు. అప్పటి తహసీల్దార్‌కు చార్జ్ మెమో ఇవ్వడంతోపా టు ఆర్‌ఐ, వీఆర్వోలను సస్పెండ్ చేయాలని వరంగల్ ఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సూచించారు.
 
వివరాల్లోకి వెళితే..

వరంగల్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం జీవో నంబర్ 58 కింద దరఖాస్తు చేసుకున్న స్థలాల ను జేసీ పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ ఉన్నతాధికారి హన్మకొం డ మండలం న్యూ శాయంపేటలో జరుగుతున్న ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారం, రెవెన్యూ అధికారుల పాత్రను జేసీకి తెలియజేశారు. వెంటనే జేసీ న్యూశాయంపేటకు వచ్చారు. అక్కడి ప్రభుత్వ భూమి సర్వే నంబర్లు 215, 260, 276లను పరిశీలించారు. ఈ భూముల్లో రికార్డుల ప్రకారం వరుసగా 1.33 ఎకరాలు, 6 గుంటలు, 9 గుంటలు.. మొత్తం 2.08 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూము ల పక్కనే ఓ ప్రముఖ సంస్థ ప్రైవేటు స్థలంలో ఇళ్ల్ల స్థలాల కోసం వెంచర్ చేసింది. ప్రైవేటు భూమిలో చేసిన వెంచర్ నుంచి ప్రధాన రోడ్డుకు వచ్చేందుకు అవకాశం లేదు. రోడ్డుకు, వెంచర్ ప్రాంతానికి మధ్యలో ఈ సర్వే నంబర్లలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక్కడి నుంచి కథ మొద లైంది.
 
అధికారుల సర్వే


అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలియడంతో తొలుత సర్వే లాండ్ రికార్డ్స్ అధికారులు భూ సర్వే చేశారు. అక్కడ వెంచర్ స్థలానికి, రోడ్డుకు మధ్యలో ఉన్నది ప్రభుత్వ భూమే అని లెక్కలు తేల్చారు. ఈ వివరాలు స్థానికంగా రెవెన్యూ అధికారులకు ఇచ్చారు. ఇక తర్వాత ఆ భూములు రక్షణ బాధ్యత రెవెన్యూ వారిది. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శనాత్మకంగా తయారైంది. సర్వే నివేదిక ఇచ్చాక కూ డా ప్రభుత్వ స్థలంలో ప్రవేటు వ్యక్తులు రోడ్డు ని ర్మాణం చేస్తున్నా వీఆర్వో, ఆర్‌ఐ పట్టించుకోలేదు. తహసీల్దార్ పర్యవేక్షణ లోపం కూడా ఉందని జేసీ నిర్ధారణకు వచ్చారు. ఇదే  భూమి విషయంలో ఇటీవల కలెక్టర్ వేసిన టాస్క్‌ఫోర్స్ బృందం కూడా రెవె న్యూ అధికారులకు వివరాలతో సమాచారం ఇచ్చిం ది. అయినా కబ్జాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జేసీ పరిశీలనలో తేలింది.
 
ఎన్‌ఓసీ ఎలా వచ్చింది


అక్కడి వ్యక్తులు భూములకు సంబంధించి ఎన్‌ఓసీ ఎవరు జారీ చేశారన్న విషయంపైనా జేసీ ఆరా తీశారు. ప్రైవేటు స్థలం చుట్టు పక్కల ప్రభుత్వ స్థలాలు ఉన్నా.. ఎన్‌వోసీ ఇచ్చే సమయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జేసీ పరిశీలనలో తేలింది. దీంతో అప్పటి ఆర్డీవో, తహసీల్దార్‌లు ఎలా వ్యవహరించారనే విషయంపైనా జేసీ ఆరా తీశారు. అప్పటి ఫైల్ పూర్తి స్థాయిలో పరిశీలించాలని విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అధికారులపై చర్యలకు ఆదే శం
 
రూ. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహా రంలో పాత్ర ఉన్నట్లు అనుమానించి స్థానిక ఆర్‌ఐ అశోక్‌రెడ్డి, వీఆర్వో మాధవరెడ్డిలను సస్పెండ్ చేయాలని వరంగల్ ఆర్డీఓకు జాయింట్ కలెక్టర్  ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హన్మకొండ తహసీల్దార్‌గా పనిచేసి సెలవులో ఉన్న చెన్నయ్యకు చార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక అందజేయాలన్నారు. విచారణ చేపడితే  ఏం జరుగుతుం దోనని రెవెన్యూ ఉద్యోగుల్లో వణుకు మొదలైంది.
 

>
మరిన్ని వార్తలు