డిగ్రీ కాలేజీల్లో బయోమెట్రిక్‌ 

19 Jul, 2018 01:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థులకు సివిల్స్‌ కోచింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,100కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో దీని అమలుకు చర్యలు చేపట్టనుంది. టీఎస్‌టీఎస్‌(తెలంగాణ స్టేట్‌టెక్నాలజీ సర్వీస్‌) నుంచి బయోమెట్రిక్‌ మిషన్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. ఒక్కో మిషన్‌కు నెలకు రూ.1,000 చొప్పున వెచ్చించి వీటిని ఏర్పాటు చేయనుంది.  

ప్రతిభావంతులకు పోటీ పరీక్షల్లో శిక్షణ 
ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు కళాశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సివిల్స్‌లో శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ప్రత్యేక పరీక్ష ద్వారా 50 లేదా 100 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణనిచ్చేలా చర్యలు చేపడుతోంది. 

నేరుగా పోస్టుల భర్తీకి చర్యలు 
డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు కళాశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, మిగిలిన పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనుంది. ఇందుకోసం నియమ నిబంధనల్లో సవరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు