ప‘రేషాన్‌’!

2 Feb, 2018 15:52 IST|Sakshi
రేషన్‌షాపులో వేలిముద్ర పరిశీలిస్తున్న డీలర్‌ 

     ఈ–పోస్‌ విధానంతో అందని సరుకులు 

     అందని సిగ్నల్స్,  పడని వేలిముద్రలు

     ఇబ్బందుల్లో లబ్ధిదారులు, డీలర్లు

మన్ననూర్‌ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్‌ విధానంతో లబ్ధిదారులకు సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. రేష న్‌ షాపుల్లో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీ సుకొచ్చింది. అయితే సిగ్నల్స్‌ అందక, లబ్ధిదారులు వేలిముద్రలు పడకపోవడంతో సరుకులు తీసుకెళ్లలేని పరిస్థితి నె లకొంది. దీంతో ఎవరికీ చెప్పుకోవాలో అయోమయంలో ఉన్నా రు. ముఖ్యంగా బియ్యం రాకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. 


 అయోమయంలో నిరక్షరాస్యులు


కొంత  మంది  నిరక్షరాస్యులు   సరుకుల   విషయమై తెలిసిన వారిని అడిగితే మండలంలో దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని, తీరా మండల అధికారులు సిబ్బంది అందుకు సంబంధించి మాకెలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామంలో డీలర్లు, సేల్స్‌మెన్లు రేషన్‌ కార్డు చూసి సరుకులు ఇచ్చేవారని కొత్తగా వచ్చిన పద్ధతితో సరుకులు ఇవ్వడం లేదంటున్నారు.

50శాతం సరుకుల  పంపిణీ


ఇప్పటివరకు లబ్ధిదారులకు 50శాతం సరుకులు పంపిణీ చేశారు. ఈనెల 26లోగా సరుకులు పంపిణీ చేయాలని అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు పలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

వేలి ముద్రలు  సరిపోవడం లేదు


మిషన్‌లో వేలి ముద్ర సరిపోవడం లేదు. దాంతో బి య్యం, కిరోసిన్‌ ఇవ్వడం లేదు. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. అధికారులు సరుకులు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి.       – చందాజీ, లబ్ధిదారుడు, మన్ననూర్‌

ఆందోళన అవసరం లేదు


ఈ–పోస్‌ విధానంతో సమస్య ఉందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇం దుకు సంబంధించి వీ ఆర్‌ఓకు అధికారం ఇ చ్చారు. వందలో ఒకరిద్దరికీ సొంత నిర్ణయంతో సరుకులు ఇప్పించే అధికారం ఉం ది. వచ్చేనెల నుంచి ఈ సమస్య రా కుండా జాగ్రత్తలు తీసుకుంటాం. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
     – కృష్ణయ్య, తహసీల్దార్, అమ్రాబాద్‌ 


 

మరిన్ని వార్తలు