హలీం– పలావ్‌ ఈటింగ్‌ పోటీ

21 May, 2019 09:11 IST|Sakshi
పోటీలో పాల్గొన్న ఆశావహులు

జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌లోని సోడాబాటిల్‌ ఓపెనర్‌ వాలా రెస్టారెంట్‌లో సోమవారం హలీమ్‌ – పలావ్‌ ఈటింగ్‌ పోటీలు నిర్వహించారు. ప్రత్యేక రంజాన్‌ మెనూతో ఏర్పాటు చేసిన ఈటింగ్‌ పోటీల్లో పెద్దసంఖ్యలో ఆశావాహులు పాల్గొన్నారు. 1.2 కేజీల హలీమ్‌ లాగించి భరత్‌ విజేతగా నిలవగా బాసిత్‌ అలీ రన్నరప్‌గా నిలిచాడు. 2.5 కేజీల  పలావ్‌ లాగించి సౌమ్య ప్రకాష్‌ విజేతగా నిలవగా 1.5 కేజీల పలావ్‌ తిని అమిత్‌నాయర్‌ రన్నరప్‌గా నిలిచాడు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు.

>
మరిన్ని వార్తలు