టీడీపీ గల్లంతు..కాంగ్రెస్‌ కనుమరుగు

12 Apr, 2019 03:40 IST|Sakshi

టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే: కె.లక్ష్మణ్‌

ఆశించిన దానికంటే బీజేపీకి ఎక్కువ సీట్లే వస్తాయి

కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వమే..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీడీపీ అడ్రస్‌ గల్లంతైందని, కాంగ్రెస్‌ కనుమరుగైందని.. ఇక టీఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రంలో రెండు పార్టీ ఉండబోతున్నాయని, అవి టీఆర్‌ఎస్, బీజేపీలే మాత్రమేనన్నారు. గురువారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాబోతోందని, రాష్ట్రంలోనూ బీజేపీకి ఆశించిన దానికంటే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయని చెప్పారు. 

శక్తివంచన లేకుండా కృషి.. 
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఆర్‌ఎస్‌ అవినీతి, కుటుంబపాలన, నియంతృత్వ పోకడలను రూపుమాపేందుకు కృషి చేస్తా మని లక్ష్మణ్‌ చెప్పారు. మోదీౖ పె ఇద్దరు చంద్రులు విషప్ర చారం చేసినా, వ్యక్తిగత విమర్శలు చేసినా ప్రజలు మరో సారి మోదీ ప్రధాని కావాలని ఓట్లు వేశారన్నారు. ఈ ఎన్నికలతో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయని.. పెద్ద ఎత్తు న కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలి పారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తలబొప్పి కట్టడం ఖాయమన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, మద్యం ఏరులై పారించిందని పాల్పడిందని ఆరోపించారు.

అయినా మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపారని.. మే 23 తర్వాత మోదీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమన్నారు. ఆ కేబినెట్‌లో రాష్ట్ర ప్రాతినిధ్యం గణనీయంగా ఉంటుందని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ఎన్నికలు కల్వకుంట్ల కుటుంబానికి చేదు అనుభ వాన్ని మిగుల్చుతాయని చెప్పారు. ఒవైసీ దేశం అంతా పొడిచేస్తానని మాట్లాడుతున్నారని, అయితే హైదరాబాద్‌లో ఓటింగ్‌ సరళిని చూస్తే వారిపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతుందని చెప్పారు. బీజేపీని బూచిగా చూపి, మతతత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని, అయినా ప్రయోజనం లేదన్నారు. 

కేసీఆర్‌.. నా భరతం పడతానన్నారు.. 
కేసీఆర్‌ అవినీతి పాలన, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల తర్వాత తన భరతం పడతానని హెచ్చరించారని, అందులో భాగంగానే తమ పార్టీ డబ్బును పట్టుకున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అకౌంటెంట్, పార్టీ సిబ్బందిపై చేయిచేసుకుని, కారును ధ్వంసం చేసి నాటకమాడారన్నారు. అనేక సమావేశాలకు సంబంధించి చెల్లింపుల కోసం నిబంధనల ప్రకారమే తా ము డబ్బు డ్రా చేశామన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులకు ఇది అకౌంటెడ్‌ మనీ అని చెప్పామని, వారు క్లియరెన్స్‌ ఇచ్చారని తెలిపారు.

పార్టీ డబ్బుల డ్రా విషయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కి కనీస అవగాహన లేదన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంత ఖర్చు చేసిందో తలసాని వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం సంతోషకరమని.. ఎన్నికలు నిర్వహించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లతో పాటు జాతీయ నాయకులు, రాష్ట్ర నేతలు, అభ్యర్థులు, కార్యకర్తలంతా శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు.  

మరిన్ని వార్తలు