నిజాంలా వ్యవహరిస్తున్న సీఎం

5 Sep, 2017 02:02 IST|Sakshi
నిజాంలా వ్యవహరిస్తున్న సీఎం
సెప్టెంబర్‌ 17పై స్పష్టత ఇవ్వాలి: కె.లక్ష్మణ్‌  
 
సాక్షి,సిద్దిపేట/జనగామ/సిరిసిల్ల:  సీఎం కేసీఆర్‌ నిజాం నవాబులా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. రాష్ట్ర విమోచన యాత్రలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కూటిగల్లు, బైరాన్‌పల్లి సాయుధ అమరవీరుల ధామం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బైరాన్‌పల్లి సభలో మాట్లా డారు. బైరాన్‌పనల్లి అమరుల ధామాన్ని స్మృతివనంలా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, సాయుధ పోరాటం పాఠ్యాంశంగా చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని అంగీకరిస్తుందా? లేదా? అనే విషయమై టీఆర్‌ఎస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు.

మజ్లిస్‌తో పొత్తు పెట్టుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ పడుతున్నాయని విమర్శించారు. యూపీఏ హయాంలో రాష్ట్రం నుంచి ముగ్గు రు కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణకు చేసిందేమిటని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా? అని సవాల్‌ విసిరారు.  
 
కాంగ్రెస్‌ మునిగిపోయిన నావ 
దేశంలో 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాగా.. ప్రజల మద్దతు కోల్పోయిన కాంగ్రెస్‌ నావ నట్టేట మునిగిపోయిందని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. సోమవారం జనగామ జిల్లాకు చేరిన విమోచనా యాత్రలో మాట్లాడుతూ దేశాన్ని పదేళ్లు పాలించిన యూపీఏ తెలంగాణకు చేసిందేమీలేదన్నారు. ప్రధాని మోదీని విమర్శించే నైతిక హక్కు ఉత్తమ్‌కు లేదన్నారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరిన యాత్రలో లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీతో కలిసి టీఆర్‌ఎస్‌ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.  
మరిన్ని వార్తలు