‘డిప్యూటీ సీఎంను తొలగించాలి’

5 Jun, 2017 13:56 IST|Sakshi
హైదరాబాద్‌: బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. లక్ష కోట్లు ఇచ్చాం అనగానే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ ఖండించిన సీఎం కేసీఆర్‌ లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందంటున్న ఎందుకు మౌనం వహిస్తున్నారని.. బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు విమర్శించారు. ఆయన  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 24 గంటల్లో భూ కుంభకోణం పై వివరణ ఇవ్వాలి. డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి ఈ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిగే  వరకు ఆయనను పదవి నుంచి దూరం పెట్టాలి. సీఎం మౌనంగా ఉన్నారంటే భూ కుంభకోణంతో సంబంధం ఉన్నట్లే. గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పై అమెరికాలో పలు కేసులు ఉన్నాయి.. సీఎం కేసీఆర్ కు ప్రసాద్ మధ్య ఉన్న బంధం ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 
మరిన్ని వార్తలు