కమలం కసరత్తు..!

20 Oct, 2018 11:59 IST|Sakshi

ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి జిల్లాలో పట్టున్న స్థానాల్లో గెలుపు కోసం కమలదళం కసరత్తు ముమ్మరం చేసింది. నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలను నియమించింది. ముఖ్యంగా నిజామాబాద్‌ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్‌ తదితర నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏకాభిప్రాయం ఉన్న స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమవడంతో ఆ పార్టీ ఆశావహుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. 

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కమలదళం కసరత్తును వేగవంతం చేస్తోంది. జిల్లాలో పట్టున్న స్థానాల్లో గెలుపు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర నాయకత్వం అభ్యర్థుల ఎంపికలో నిమ గ్నం కాగా, క్షేత్ర స్థాయిలో శ్రేణులను సమన్వయ పరిచేందుకు సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ఆ పా ర్టీ ముఖ్య నేతలను రంగంలోకి దింపింది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఐదు నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లుగా మహారాష్ట్ర కు చెందిన నేతలను నియమించింది. నాందేడ్‌ జిల్లాకు చెందిన ఈ నాయకులు ఇటీవలే జిల్లాకు చేరుకున్నారు.

అలాగే జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్‌ స్థానాలకు కర్ణాటకకు చెందిన నేతలను కోఆర్డినేటర్లుగా నియమించింది. వీరు క్షేత్రస్థాయిలో బూత్‌ కమిటీలను, శక్తి కేంద్రాలను పర్యవేక్షిస్తారని ఆ పార్టీ జి ల్లా నాయకత్వం పేర్కొంటోంది. త్వరలో మండలానికి ఒకరు చొప్పున కో ఆర్డి నేటర్లను నియమిస్తారని చెబుతున్నారు. ఈ నేతలు పార్టీ పరిస్థితిని క్షేత్ర స్థాయిలో సమీక్షిం చి ఎప్పటికప్పుడు ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి నివేదించనున్నారు. అలాగే ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతలను జిల్లాలోని ఒక్కో పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌చార్జులుగా నియమించాలని బీజేపీ భావిస్తోంది.

పట్టున్న స్థానాలపై ప్రత్యేక గురి 
ఉమ్మడి జిల్లా పరిధిలో అన్ని స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించిన బీజేపీ.. పట్టున్న సా ్థనాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నిజామాబాద్‌ అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో పట్టు సాధిం చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు అభ్య ర్థుల ఎంపికను ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వేగవంతం చేసింది. ఒకటీ రెండురోజుల్లో తొలిజాబితా ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది. శుక్రవారం సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏకాభిప్రాయం ఉ న్న స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పని లో నిమగ్నవడంతో ఆ పార్టీ ఆశావహుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. పార్టీకి గట్టి పట్టున్న నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

యెండల లక్ష్మీనారాయ ణ, ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్త, బస్వా లక్ష్మీనర్సయ్యలతో పాటు, కొత్తగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధర్మపురి అర్వింద్‌ పేరు తెరపైకి వస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్ర క్రియలో భాగంగా రాష్ట్ర అధినాయకత్వం ఆ యా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల అభిప్రా య సేకరణ చేపట్టింది. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు అర్వింద్‌ పేరును ప్రస్తావించారు. ఎంపీలుగా పోటీ చేయాలని భావిస్తు న్న నేతలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగాలని అధినేత అమిత్‌షా సూచించిన నేపథ్యంలో అర్వింద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీకి మంచి పట్టున్న, స్పష్టత ఉన్న స్థానాలైన కామారెడ్డి, ఆర్మూర్‌ స్థానాలకు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పొద్దుటూరి వినయ్‌రెడ్డిల అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యా యని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు