‘విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలి’

10 Jun, 2020 14:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధిక విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ నేతలు ట్రాన్స్‌ కో సీఎండీ  రఘమా రెడ్డిని బుధవారం కలిశారు. వీరిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. సీఎండీని కలిసిన అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ, లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలెవ్వరూ మూడు నెలలుగా బయటకు రాలేదన్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు వేల రూపాయల కరెంట్‌ బిల్లులు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం కరెంట్‌ బిల్లులను మాఫీ చేయాలని కోరారు. కరోనా నియంత్రణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్‌ మొదట్లో ఒక మాట ఇప్పడు ఒక మాట మాట్లాడుతున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. కరోనా రోగులందరికి ప్రభుత్వమే చికిత్సనందించాలని డిమాండ్‌ చేశారు. (కోవిడ్‌కేసుల్లో చార్జ్‌షీట్స్‌! )

అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, రావాల్సిన కరెంట్‌ బిల్లులకంటే రెండు రెట్లు అధికంగా కరెంట్‌ బిల్లు వచ్చిందన్నారు. కరెంట్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సముచితం కాదన్నారు. దీని గురించి ట్రాన్స్‌కో సీఎండీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
(వాహనాలను మార్గంలో అనుమతించడం లేదు)

మరిన్ని వార్తలు