ప్రభుత్వ చేతగానితనం వల్లే...

5 May, 2017 03:01 IST|Sakshi
ప్రభుత్వ చేతగానితనం వల్లే...

రైతు సమస్యలపై బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.  గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మిర్చి కొనుగోలులో ప్రభుత్వం నిస్సహాయంగా చేతులెత్తేసిన నేప థ్యంలో కేంద్రం తీసుకున్న చొరవ రైతుల్లో ధైర్యాన్ని నింపిందన్నారు.   రైతులకు చేయూతనిచ్చేందుకు కేంద్రం ముందుకు రాగా, దానిని కూడా టీఆర్‌ఎస్‌ ఫ్రభు త్వం రాజకీయం చేసి తన అసమర్థతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, బహిరంగసభల కోసం వ్యాపారుల నుంచి పార్టీ నాయకులు డబ్బులు వసూలు చేసి రైతులను గాలికొదిలేశారన్నారు. తాను శుక్రవారం ఖమ్మం మార్కెట్‌యార్డును సందర్శించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు