రైతుల భూములను లాక్కుంటున్నారు

22 Sep, 2017 12:09 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ధ్వజం

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమేమో కానీ.. ఆ పేరుతో అనేకమంది చిన్న, సన్నకారు రైతులను నిరాశ్రయులను చేస్తూ వారి భూములను బలవంతంగా లాక్కుంటోందని బీజేపీ శాసనసభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.  రూ. వేల కోట్ల నిధులు సమకూరుస్తున్నా కేంద్రానికి పేరు రాకుండా ఉండేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు.

రూ. కిలో బియ్యం పథకానికి కేంద్రం రూ. 27 సబ్సిడీ ఇస్తోందని.. అందువల్ల కొత్త రేషన్‌ కార్డులపై కేంద్ర ప్రభుత్వ చిహ్నం ముద్రించాలని సూచి స్తే.. సీఎం ఇందుకు ఇష్టపకుండా కొత్త రేషన్‌ కార్డులనే నిలిపివేశారని ఆరోపించారు. రాష్ట్రం కుంభకోణాల మయంగా మారిందన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నవంబర్‌లో 3 రోజులు హైదరాబాద్‌లో ఉండనున్నారు.

మరిన్ని వార్తలు