‘అలా చెప్పమని పెద్దలు ఆదేశించారా..?’

9 Jul, 2020 11:24 IST|Sakshi

ఎమ్మెల్యే రాజా సింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో నేరాలను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని ఎమ్మెల్యే రాజా సింగ్‌ విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ  ‘‘నగరం లో ఈ ఆరు నెలల్లో క్రైమ్ రేట్ తగ్గింది అని పోలీస్ కమిషనర్ ప్రకటన ఇచ్చారు. సీపీ అంజనీకుమార్‌కు గుర్తుచేస్తున్న.. 20 రోజుల్లోపే 6 హత్యలు జరిగాయి. చోరీలు, హత్యలు, అత్యాచారాలు ఎన్ని జరిగాయో మీరే చెప్పాలని’’  రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ఈ క్రైమ్ రేట్ తగ్గినట్లు ప్రకటనలు పోలీస్ కమిషనర్ ఇస్తున్నారా? ఫామ్‌ హౌస్‌లో కూర్చొని క్రైమ్ తగ్గినట్లు చెప్పమని పెద్దలు ఆదేశిస్తున్నారా ? అర్థం కావడం లేదంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా