అందుకే ఎరువుల కొరత ఏర్పడింది: ఎంపీ అర్వింద్‌

5 Sep, 2019 14:28 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : జిల్లాలో ఏర్నడ్డ యూరియ కొరతపై గురువారం బీజేపీ ఎంపీ అర్వింద్‌ మండిపడ్డారు. ఎరువుల కొరత ముమ్మాటీకీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని, రాష్ట్రానికి కావాల్సిన ఎరువులను కేంద్రం సమృద్ధిగానే పంపిదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే కేం‍్రం ఎక్కువ ఇచ్చి నిల్వ చేసుకోమని చెప్పిందని, కేసీఆర్‌ కుటుంబానికి ప్రాజెక్లుల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని విమర్శించారు. కేంద్ర నిధులు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే మళ్లిస్తున్నారని, అందుకే జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ ఫామ్‌ హౌజ్‌కే పరిమితం అయ్యారని, జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించలేదనే కక్ష్య సాధింపుతోనే ఎరువులు ఇవ్వడం లేదని  ఎంపీ అర్వింద్‌ దుయ్యబట్టారు.

మరిన్ని వార్తలు