మూసీ ప్రక్షాళనపై ఉద్యమిద్దాం

21 Mar, 2017 02:25 IST|Sakshi
మూసీ ప్రక్షాళనపై ఉద్యమిద్దాం

దశల వారీ కార్యాచరణకు బీజేపీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జనజీవనంతో ముడిపడిన మూసీ నది ప్రక్షాళనకు దశల వారీగా కార్యాచరణను చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఘన చరిత్ర ఉన్నా ప్రస్తుతం కాలుష్యం బారిన పడి ఆరేడు జిల్లాల ప్రజలపై ప్రభావం చూపుతున్న మూసీ కాలుష్య సమస్యపై వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించింది. రాష్ట్రంలోని కోటిన్నర జనాభాపై మూసీ కాలుష్య దుష్పరిణాలు పడుతున్నందున, నది ప్రక్షాళనపై దృష్టి పెట్టాలని బీజేపీ నాయకత్వం అభిప్రాయపడుతోంది.

ఈ నేపథ్యంలో దీనిపై ప్రాథమిక కసరత్తుతోపాటు, పూర్తి అవగాహన, సమాచారం కోసం నిపుణులతో సోమవారం సాయంత్రం వరకు బీజేపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.మనోహర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ సెల్‌ కన్వీనర్‌ ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ వేత్తలు కె.పురుషోత్తంరెడ్డి, నర్సింహారెడ్డి, సెంట్రల్‌ ల్యాబ్స్‌కు చెందిన అనంత్‌ హాజరయ్యారు.

మరిన్ని వార్తలు