విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి 

15 Sep, 2019 03:41 IST|Sakshi

గవర్నర్‌కు బీజేపీ నేతలు వినతి 

హైదరాబాద్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్‌ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలోని బృందం శనివారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కోరింది. ఈ మేరకు గవర్నర్‌కు వినతి పత్రం అందజేసింది. అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా బీజేపీ నేత విద్యాసాగర్‌రావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఇందుకోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు విమోచన దినోత్సవాన్ని అధికారికం గా నిర్వహించాలని కోరుతున్నారని చెప్పారు. రజాకార్ల పార్టీ అయిన మజ్లిస్‌కు కేసీఆర్‌ భయపడుతు న్నారన్నారు. సాయుధ పోరాటంలో ప్రాణాల రి్పంచిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి ఎందరో త్యాగధనుల చరిత్రను తొక్కి పెడుతున్నారన్నారు. సెప్టెంబర్‌ 17న జాతీయ జెండా ఎగురవేసి, బైక్‌ ర్యాలీ చేపడతామన్నారు. గవర్నర్‌ను కలసిన వారిలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్, బీజేపీ నేతలు డీకే అరుణ, పెద్దిరెడ్డి, జితేందర్‌రెడ్డి, వివేక్, రవీంద్రనాయక్, ఇంద్రసేనారెడ్డి, ఆకుల విజయ, తెలం గాణ విమోచన కమిటీ చైర్మన్‌ శ్రీవర్ధన్‌రెడ్డి ఉన్నారు.  

మరిన్ని వార్తలు