తెలంగాణలో బీజేపీదే అధికారం: ఎంపీ హరిబాబు 

12 Nov, 2018 19:03 IST|Sakshi
మాట్లాడుతున్న హరిబాబు  

సాక్షి, కీసర: దశాబ్దాల కార్యకర్తల కష్టం ఫలించే రోజు దగ్గరలోనే ఉందని, తెలంగాణలో బీజేపీ  అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, విశాఖ (వైజాగ్‌) ఎంపీ కంభం పాటి హరిబాబు అన్నారు. ఆదివారం కీసరలోని కేబీఆర్‌ కన్వెన్షన్‌లో నిర్వహించిన బీజేపీ మేడ్చల్‌ అసెంబ్లీ బూత్‌ నాయకుల ప్రత్యేక శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశ శక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన నరేంద్రమోదీ నాయకత్వం కారణంగా దేశం అభివృద్ధి దిశగా అవినీతి లేని పాలన సాగుతోందన్నారు.  అసమర్థ టీఆర్‌ఎస్‌ను, మహాకూటమిని ఓడించి తెలంగాణలో బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

వారిని పోలింగ్‌  దిశగా తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్‌ నాయకులదేనన్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో ఐదేళ్లుగా నిత్యం ప్రజలతో ఉంటూ , డంపింగ్‌యార్డు ఎత్తివేసేలా తీర్పురావడానికి కారణమైన మేడ్చల్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొంపల్లి మోహన్‌రెడ్డి గెలుపు ఖాయమన్నారు. కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లి ఈసారి ఎన్నికల్లో బిజేపీ అభ్యర్థి గెలుపునకుకృషి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కొంపల్లిమోహన్‌రెడ్డి, రాష్ట్రనాయకులు బిక్కు నాయక్, విక్రంరెడ్డి, సురేష్, శ్రీసుధ, రామోజీ, వెంకట్‌రెడ్డి, గుండ్ల ఆంజనేయులు, జిల్లాల తిరుమల్‌రెడ్డి,  సుధాకర్‌నాయక్,  శ్రీనివాస్, సుజాత,  రజినీరెడ్డి, ఈశ్వర్‌గౌడ్, కిషన్‌రావు, అసెంబ్లీ కన్వీనర్‌ అమరం మోహన్‌రెడ్డి, బోడ శ్రీనివాసరావు, ఏనుగు రాజిరెడ్డి, రాగుల అశోక్, వివిధ మండలాల నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు