హుండీలు నిండుతున్నాయి

16 Nov, 2016 02:14 IST|Sakshi
హుండీలు నిండుతున్నాయి

ఆలయాలకు పోటెత్తుతున్న పెద్ద నోట్లు
కానుకలుగా సమర్పించుకుంటున్న ‘పెద్ద భక్తులు’
భక్తుల సంఖ్య తగ్గుతున్నా భారీ ఆదాయం!

 సాక్షి, హైదరాబాద్:
కార్తీక సోమవారం. శివునికి రుద్రాభిషేకం చేయాలి. టికెట్ రూ.300. ఓ భక్తుడు రూ.500 నోటిచ్చాడు. రూ.200 తిరిగివ్వడానికి సిబ్బం దికి చిల్లర దొరకలేదు. చిల్లర బదులు 8 లడ్డూ ప్రసాదాలను భక్తుని చేతిలో పెట్టారు. అన్ని వద్దని, చిల్లరే ఇవ్వాలని కోరినా చేతులెత్తేశారు!

మరో భక్తుడు అమ్మవారికి కుంకుమార్చన చేరుుంచాడు. టికెట్ రుసుము పోను మిగతా చిల్లర సిబ్బంది ఇవ్వలేకపోయారు. దాంతో సదరు భక్తుడు ఆ మొత్తాన్ని ఆలయానికే విరాళంగా ఇచ్చేశాడు!!

ఇంకో ఆలయంలో మూడు హుండీలూ ఒక్కసారిగా నిండిపోయారుు. రూ.1,000, రూ.500 నోట్లు నిండుగా నిండి, చోటు చాలక బయటికి హుండీల్లోంచి బయటికే కనిపిస్తున్నారుు. దాంతో ఎప్పట్నుంచో మూలపడి ఉన్న పాత హుండీ దుమ్ముదులిపి తెచ్చిపెడితే అదీ నిండిపోరుుంది!!

రాష్ట్రంలో భక్తి భావం ఉప్పొంగుతోంది. భగవంతునికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. ఇష్టాలయాలకు బారులుతీరి మరీ హుండీలను నోట్లతో నింపేస్తున్నారు. చిన్న దేవాలయాల్లో కూడా హుండీలు ఇట్టే నిండిపోతున్నారుు! అంతా పెద్ద నోట్ల రద్దు ఫలితం!! రూ.1,000, 500 నోట్లను భారీగా పోగేసుకున్న ‘పెద్ద’భక్తులు వాటిని భారీగా ఆలయాలకు సమర్పిస్తున్నారు. విరాళంగా ఇస్తే పేర్లు వెల్లడించాల్సి వస్తుందని నోట్ల కట్టల రూపంలోనే హుండీల్లో వేసేస్తున్నారు. దాంతో హుండీలు చకచకా నిండిపోతున్నారుు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోన ప్రధాన దేవాలయమైన కాళేశ్వరంలో దాదాపు నాలుగు హుండీలూ పూర్తిగా నిండిపోయారుు. ఇక్కడ సాధారణంగా మూడు నెలలకోసారి హుండీలు తెరుస్తారు.

ఉత్సవాలు, పండుగలప్పుడైనా నెలకోసారే తెరుస్తారు. ఇప్పుడు అంతకంటే ముందే హుండీలు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలోనూ హుం డీలు బరువెక్కారుు. వాటిని తెరిచి నాలుగు రోజులే కావడం విశేషం! రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! విచిత్రమేమిటంటే, చిల్లర సమస్యతో ప్రయాణాలు ఇబ్బందికరంగా మారి సాధారణ రోజుల కంటే అన్ని ఆలయాలకూ భక్తుల రద్దీ ఇప్పుడు కాస్త తగ్గింది. ఆ లెక్కన హుండీ ఆదాయం తగ్గాల్సింది పోరుు సీన్ రివర్సవుతోంది! రద్దరుున పెద్ద నోట్లు భారీగా ఉండి, బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు లేని ‘భక్తులు’అందులో వీలైనంత మొత్తాన్ని దేవుళ్లకు సమర్పించేస్తున్నారు.

సాధారణంగా రోజుకు రూ.లక్షన్నర దాకా ఉండే భద్రాచలం రామాలయం హుండీయేతర ఆదాయం ఐదారు రోజులుగా రూ.ఐదున్నర లక్షలు దాటుతోం ది! అరుుతే, రద్దరుున పెద్ద నోట్లు ప్రస్తుతానికి చెల్లుతాయంటూ కేంద్రం ప్రకటించిన జాబి తాలో ఆలయాలు లేకపోవడంతో వాటికి ఇలా వచ్చిపడుతున్న నోట్ల చెల్లుబాటుపై అయోమయం నెలకొంది. వీటిని డిసెంబరు 31లోపు మార్చుకోవాల్సి ఉండటంతో ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమ చేయాల్సిందిగా ఆదేశిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ తాజాగా ఆలయాలన్నింటికీ సర్క్యులర్ ఇచ్చారు. తద్వారా బ్యాంకుల నుంచి అభ్యంతరాలేమైనా వస్తే తదుపరి కార్యాచరణకు సమయం చిక్కుతుందన్నది శాఖ ఆలోచన.

చిల్లర చిక్కులు
మరోవైపు ఆలయ సిబ్బందిని చిల్లర చిక్కులు వేధిస్తున్నారుు. సేవలు, పూజాదికాల కోసం భక్తులు రూ.1,000, 500 నోట్లే ఇస్తుండటంతో చిల్లర ఇవ్వడం వారి తరం కావడం లేదు. దాంతో చిల్లరకు బదులు ప్రసాదం ఇచ్చి సరిపెడుతున్నారు. మరికొందరికి భవిష్యత్తు సేవల కోసం అడ్వాన్సుగా పేర్లు రాసి రశీదులిస్తున్నారు. ఇంకొందరు భక్తులు ఆ మొత్తాన్ని విరాళంగా సమర్పిస్తున్నారు. ఇంకోవైపు రోజువారి ఆలయ ఖర్చులకు డబ్బులు సమకూర్చుకోవటం కూడా సిబ్బందికి సమస్యగానే మారింది. బ్యాంకు నుంచి రోజువారి నగదు విత్‌డ్రాకు పరిమితి ఉండటం, గంటల తరబడి లైన్లలో నుంచోవాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట వంటి ఆలయాల్లో సాధారణంగా ఘనంగా జరిగే కార్తీక పౌర్ణమి వేడుకలు ఈసారి ఇలాంటి కారణాలతో వెలవెలబోయారుు.

మరిన్ని వార్తలు