పదకొండేళ్లకు.. పడవ దొరికింది!

22 Nov, 2017 03:37 IST|Sakshi
దొరికిన పడవతో గంగపుత్రులు

2006లో వరదలో కొట్టుకుపోయిన నాటుపడవ.. కాళేశ్వరం వంతెన వద్ద లభించిన పడవ

కాళేశ్వరం(మంథని): గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగ డంతో కాళేశ్వరం వద్ద పదకొండేళ్ల క్రితం వరదలో కొట్టుకుపోయిన నాటుపడవ మంగళవారం గంగపుత్రులకు దొరికింది. 2006, ఆగస్టులో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సిరొంచకి చెందిన గంగపుత్రులు గోదావరిపై ప్రయాణికులను తెలంగాణ–మహారాష్ట్రకు చేరవేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో కాళేశ్వరం గోదావరి ఒడ్డున నగరానికి చెందిన నాటుపడవను కర్రకు కట్టి గంగపుత్రులు నిద్రించారు. అర్ధరాత్రి ఒక్కసారిగా గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి పెరగడంతో ఆ నాటుపడవ వరదలో కొట్టుకుపోయింది.

పడవ కోసం గంగపుత్రులు రూ. లక్షన్నర ఖర్చు చేసినా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర వం తెనకు దగ్గరలో  జాలర్లు చేపల కోసం వలలు వేయగా కర్రకు ఏదో అడ్డు తగిలింది. అనుమానం వచ్చిన గంగపుత్రులు నీటమునిగి చూసి పడవగా గుర్తిటంచారు. దానిపై ఇసుక కప్పేయడంతో మంగళవారం 40 మంది గంగపుత్రులు ఇసుకను తోడుతూ పడవను సాయంత్రం వరకు బయటికి తీశారు. ప్రస్తుతం పడవ విలువ రూ.6 లక్షలకుపైగా ఉంటుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు