శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్యకు సీఎం, మంత్రులే కారణం: బోడిగ శోభ

14 Oct, 2019 13:29 IST|Sakshi

సాక్షి, కరీంనగర్ జిల్లా:  సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్‌లపై మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు సీఎం, మంత్రులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడి కార్మికుడి ఆత్మహత్యకు కారణమైన సీఎంతో పాటు ముగ్గురు మంత్రులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని శోభ డిమాండ్‌ చేశారు.  24 గంటల్లో కేసు నమోదు చేయకుంటే పీఎస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు స్వీకరించారు.

మరిన్ని వార్తలు