ఆటోలో కరోనా రోగి మృతదేహం తరలింపు

11 Jul, 2020 15:26 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించిన దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. నిబంధనలు ప్రకారం కరోనా వైరస్ ద్వారా మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు  ధరించి జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మాత్రం వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

ఆటోలో కరోనా  రోగి మృతదేహాన్ని స్మశాన వాటిక కు తరలించారు. డ్రైవర్‌తో పాటు ఆటోలో ఉన్న మరో వ్యక్తి కూడా  పీపీఈ  కిట్లు ధరించలేదు. ఎలాంటి  కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకేసారి ముగ్గురు కరోనా రోగులు మరణించడంతో ఒక్కటే అంబులెన్స్‌ అందుబాటులో ఉందని, అందువల్ల ఆటోలో తరలించామని ప్రభుత్వాసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు