ఇంటర్‌సిటీ ట్రైన్‌కు బాంబు బెదిరింపు

6 Feb, 2020 08:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం చోటు చేసుకుంది. ఉదయం 5:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ నుంచి అమరావతికి వెళ్లాల్సిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో ఆందోళన రేగింది. డయల్‌ 100కు ఫోన్‌ చేసి ట్రైన్‌లో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించడంతో రైల్వే స్టేషన్‌లోనే ఆ రైలును ఆర్‌పీఎఫ్‌ పోలీసులు నిలిపివేశారు. రైలును అణువణువు తనిఖీ చేశారు. ఆర్‌పీఎఫ్‌ సీనియర్ డివిజన్ కమిషనర్ గాంధీ ఆధ్వర్యంలో తనిఖీలు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదని తెలిపారు. అదేవిధంగా బాంబు బెదిరింపు ఫోన్‌ కాల్‌ను ఫేక్ కాల్‌గా గుర్తించారు. దీంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఫోన్‌ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు