‘మహంకాళి’ మురిసేలా..

14 Jul, 2014 03:30 IST|Sakshi
‘మహంకాళి’ మురిసేలా..

దోమకొండ : అమ్మవారికి భక్తితో బోనాలు సమర్పించడానికి తరలివచ్చిన భక్తులతో మండల కేంద్రంలోని మహంకాళి అమ్మవారి మందిరం పోటెత్తింది. నైవేధ్యం సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మహంకాళి ఆలయంగా పేరుగాంచిన దోమకొండలోని ఆల యం వద్ద ఆదివారం బోనాల పండుగ వైభవంగా జరిగింది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఉద యం అమ్మవారికి అభిషేకాదులు నిర్వహించారు. 7 గంటలకు ఘటం మొదలైంది. పోతరాజులు సందడి చేశారు. 11 గంటలకు రంగం ప్రారంభమైంది. భవిష్యవాణి వినడానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
 
ఆలయ అర్చకులు భావి కృష్ణమూర్తి శర్మ, ఇతర పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించారు. జడ్పీటీసీ సభ్యుడు గండ్ర మధుసూదన్‌రావు, వైస్ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, స్థానిక సర్పంచ్ దీకొండ శారదతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవం లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు రాంచంద్రం, ప్రతినిధులు శ్రీనివాస్, రాజేందర్, నర్సయ్య, శేఖర్, రాజు, నర్సింలు, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మొక్కులు చెల్లిస్తేనే..
ఈసారి వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని రంగనాయకి భవిష్యవాణి వినిపించింది. అదీ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటేనే వానదేవుడు కరుణిస్తాడని కండిషన్ పెట్టిం ది. దోమకొండలో బోనాల పండుగ సందర్భంగా రంగనాయకి భవిష్యవా ణి వినిపించింది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని పేర్కొంది. శివుడికి అభిషేకాలు చేయాలని సూ చించింది. పూజలతో దేవతలు కరుణిస్తేనే వర్షాలు కురుస్తాయని, పాడిపంటలు, పిల్లా పాపలతో ప్రజలు సుభిక్షంగా ఉంటారని పేర్కొంది.

మరిన్ని వార్తలు