మున్సిపాలిటీలకు మహర్ధశ

15 Mar, 2018 11:06 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గ్రేడ్‌–1 మున్సిపాలిటీలకు రూ.20 కోట్లు

 గ్రేడ్‌–2 మున్సిపాలిటీలకు రూ.10 నుంచి రూ.15 కోట్లు

 నగర పంచాయతీలకు రూ.10 కోట్లు 

ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని ఉత్తర్వులు

స్పెషల్‌ ఆఫీసర్ల హోదాలో కలెక్టర్, జేసీ

ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకుని పనులు  పర్యవేక్షించాలి

జూన్‌ 2 నుంచి పనులు ప్రారంభం

నల్లగొండ :  మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది..! మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలం గాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీయూఎఫ్‌ఐడీసీ) కింద ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమి స్తున్న క్రమంలో వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఐడీసీ ద్వారా ఒక్కో మున్సిపాలిటీకి సుమారు రూ.20కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

దీంట్లో గ్రేడ్‌–1 మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, గ్రేడ్‌–2 మున్సిపాలిటీకి రూ.10 నుంచి 15కోట్లు, నగర పంచాయతీలకు రూ.10కోట్ల వరకు నిధులు కేటా యించనున్నారు. నల్లగొండ గ్రేడ్‌ వన్‌ మున్సిపాలిటీ కావడంతో రూ.15 నుంచి రూ.20కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మి ర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.10 నుం చి రూ.15కోట్లు, దేవరకొండ నగర పంచా యతీకి రూ.10కోట్ల వరకు నిధులు మం జూరయ్యే అవకాశం ఉందని అంటున్నా రు.

దేవరకొండకు ఇప్పటికే రూ.5 కోట్లు మంజూరు చేసినందున ఎఫ్‌ఐడీసీ ద్వారా మరో రూ.5కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు, పనుల పర్యవేక్షణ బాధ్యతలు మున్సి పాలిటీ అధికారులకు సంబంధం లేకుం డా జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. 

నిర్ణీత గడువులోగా వినియోగించుకోవాలి..
ఎఫ్‌ఐడీసీ ద్వారా విడుదలయ్యే నిధులు నిర్ణీత గడువులోగా వినియోగించుకునే విధంగా పనులను వేగవంతంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదలను ఈ నెలాఖరులోగా పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాతి రెండు, మూడు మాసాల్లో పనులు పరిపాలన ఆమోదం పొంది, టెండర్లు పిలుసా ్తరు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స వం జూన్‌2న పనులు ప్రారంభిస్తారు.

స్పెషల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణలో..
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సలహా, సూచనల మేరకు మాత్రమే ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతిపాధనల విషయంలో ప్రజాప్రతినిధుల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నిధుల విషయంలో ము న్సిపల్‌ కమిషనర్‌లకు ఎలాంటి సంబందమూ లేదు. పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ శాఖ పనులను ఎగ్జిక్యూటివ్‌ చేస్తుంది. ననుల పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. మున్సిపల్‌ పాలకవర్గాలు లేని కాలంలో స్పెషల్‌ అధికారులుగా వ్యవహరించిన కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, జిల్లా అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

స్పెషల్‌ ఆఫీసర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. నల్లగొండ మున్సిపాలిటీ స్పెషల్‌ ఆఫీసర్‌గా కలెక్టర్, మిర్యాలగూడ మున్సిపాలిటీ స్పెషల్‌ ఆఫీసర్‌గా జాయింట్‌ కలెక్టర్, దేవరకొండ స్పెషల్‌ ఆఫీసర్‌గా డీఆర్‌డీఓ లేదా డీఆర్వోను నియమించే అవకాశం ఉంది.

చేపట్టే అభివృద్ధి పనులు...
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనమైన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు తొలిప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీటితోపాటు మున్సిపాలిటీ వార్డుల్లో సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయం, పార్కులు, ఎల్‌ఈడీ లైట్స్, మోడల్‌ మార్కెట్స్, ఆడిటోరియంల నిర్మాణం, ఫుట్‌పాత్‌లు, బస్‌బేలు, మురికి కాల్వల అభివృద్ధి, శ్మశాన వాటికల పనులు చేపడతారు. 

మరిన్ని వార్తలు