గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తా..

4 Apr, 2019 15:34 IST|Sakshi
నర్సయ్యగౌడ్‌కు తిలకం దిద్దుతున్న సునీత, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు 

టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌

సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లను నింపి గోదావరి జలాలు తీసుకొచ్చి ఆలేరు నియోజకవర్గాన్ని ససశ్యామలం చేస్తానని టీఆర్‌ఎస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. బుధవారం యాదగిరిగుట్ట పట్టణంతో పాటు వంగపల్లిలో రోడ్‌ షోతో పాటు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న ఐదేళ్ల కాలంలో భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. బీబీనగర్‌లో నిమ్స్‌ను రూ.1,028కోట్లతో ఏయిమ్స్‌గా మార్చానని, కేంద్రీయ విద్యాలయానికి రూ.18కోట్లు, దండుమల్కాపుర్‌లో రూ.1,000 కోట్లతో గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్, జనగామ, సూర్యాపేట, నల్లగొండ, సిద్దిపేట, ఇబ్రహీం పట్నంలలో రూ.500కోట్లతో మెడికల్‌ కాలేజీలు, చిట్యాలలో డ్రైపోర్టుకు రూ.1,000కోట్లు, పెంబర్తి, మోత్కూరు, పోచంపల్లిలో కులవృత్తులు, తాటి పరిశోధన కేంద్రాలలను కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించానని వెల్లడించారు.  

కోమటిరెడ్డి బ్రదర్స్‌ గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉండి తమ ప్రాంతాలను ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం వీస్తుందని, 16 మంది ఎంపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజ లంతా ముందుకొస్తున్నారని.. దేశానికి  కేసీఆర్‌ నాయకత్వం వహించాలని ప్రజలంతా కోరుకుంటున్నారని అన్నారు.  

ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి మిట్ట వెంకటయ్యగౌడ్, పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, యువజన విభాగం కన్వీనర్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్, ఎంపీటీసీ సీస కృష్ణగౌడ్, మధర్‌డైరీ డైరెక్టర్‌ కల్లెపల్లి శ్రీశైలం, వంగపల్లి ఉపసర్పంచ్‌ రేపాక స్వామి, మాజీ సర్పంచ్‌ చంద్రగాని నిరోష జహంగీర్, బూడిద స్వామి, కైరంకొండ శ్రీదేవి, నాయకులు అంకం నర్సింహ, నువ్వుల రమేష్, కాంటేకార్‌ పవన్‌కుమార్, చిత్తర్ల బాలయ్య, గోపగాని ప్రసాద్, సయ్యద్‌ సలీం, మిట్ట అనిల్‌గౌడ్, మిట అరుణ్‌గౌడ్, కోల వెంకటేష్‌గౌడ్, సయ్యద్‌ బాబా, గునగంటి బాబురావుగౌడ్‌ తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు