మత్స్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి

5 Jan, 2018 03:01 IST|Sakshi

కేంద్రాన్ని కోరిన ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేలా రాష్ట్రంలో ఇన్లాండ్‌ ఫిష్‌ ఫార్మింగ్‌ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవ సాయ శాఖ సహాయ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ కోరారు. గురువారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసిన బూర నర్సయ్య, తెలంగాణలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న చేయూతను వివరించారు. రైతులకు ఉచితంగా 40 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా అవకాశాలు కల్పించే ఇన్లాండ్‌ ఫిష్‌ ఫార్మింగ్‌ పరిశోధనా కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన కోరారు. అలాగే కేంద్ర రైల్వే మంత్రి పీయుష్‌ గోయల్‌ను కలసి జనగాంలో వీవర్స్‌కాలనీ వద్ద అండర్‌పాస్‌ బ్రిడ్జ్‌ని ఏర్పాటు చేయాలని కోరారు.
 

మరిన్ని వార్తలు