బోసిపోతున్న ‘సాగర్’

25 Feb, 2015 03:29 IST|Sakshi

రోజురోజుకూ అడుగంటుతున్న జలాలు ప్రధాన కాల్వకు కొనసాగుతున్న నీటి విడుదల భవిష్యత్తులో దాహం తీరేది అనుమానమే!వేసవిలో మోగనున్న ప్రమాద ఘంటికలు
 
నిజాంసాగర్: జిల్లా వరప్రదారుుని అయిన నిజాంసాగర్ ప్రాజె క్ట్టులో నీటి నిల్వలు క్రమ క్రమంగా పడిపోతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే తాగునీటి అవసరాల కోసం ప్రధా న కాలువకు నీటి విడుదల చేపడుతుండటంతో ‘సాగర్’ నీరు అడుగంటుతోంది. బోధన్ పట్టణం, నిజామాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి నిజాంసాగర్ నీటిని ఉపయోగిస్తున్నారు. ఈ నెల 20 నుంచి ప్రధాన కాలువకు 1,240 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నారు. నాలుగు రోజుల పాటు 400 ఎమ్‌సీఎఫ్‌టీల నీటిని మాత్రం విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

కానీ, ఆరు రోజుల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.తద్వారా ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గుతుండటంతో రాను న్న కాలంలో తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. బోధన్, నిజామాబాద్ ప్రజలకు తాగునీరందించేందుకు బెల్లాల్ చెరువు, అలీసాగర్ రిజర్వాయర్‌ను పూర్తిస్థాయి లో నింపాలని అధికారులు నిర్ణరుుంచారు.బెల్లాల్ చెరువు ద్వారా బోధన్ పట్టణానికి రోజుకు 1.5 ఎమ్‌సీఎఫ్‌టీలు, అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా జిల్లా కేంద్రానికి 1.5 ఎమ్‌సీఎఫ్‌టీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ రెండు జలాశయూలను పూర్తిగా నింపినా నెల రోజుల అవసరాలకే సరిపోతా రుు. ఈ లెక్కన  వచ్చే మార్చి నెలాఖరు నుంచి తాగునీటికి అవస్థలు పడాల్సిందే.
 
గతేడాది కంటే తగ్గిన నిల్వలు
 నిజాంసాగర్ నీటిమట్టం గతేడాదితో పోలిస్తే ఈ యేడు భారీగా తగ్గిపోరుుంది. ప్రాజెక్టు పూర్తిస్థారుు నీటిమట్టం 1405 అడుగులు. 17.08 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1 379.16 అడుగులతో 1.17 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయూనికి 1398.88 అడుగులతో 10.189 టీఎం సీల నీరు నిల్వ ఉంది.కనిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో సాగర్ వెల వెలబోతోంది. ఈ యేడు వర్షాలు సకాలంలో కురవకపోతే తాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. మెదక్ జిల్లాలో ఉన్న సింగూరు జలాశయంలో సైతం నీటి మ ట్టం ఆశాజనకంగా లేదు. దీంతో సింగూరు జలాలపై ఆశలు ఆవిరికానున్నాయి.

గత రబీ సీజన్‌లో సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్  ప్రాజెక్టుకు ఏడు టీఎంసీల నీటిని విడుద   ల చేయూలని ప్రతిపాదించారు. నాలుగు టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో గత వేసవిలో తాగు నీటికి ఢోకా లేకుండా పోయింది. ప్రస్తుతం సింగూరు జలాశయంలో 517.654 మీటర్లతో 8.5 టీఎంసీల నీరు మా    త్రమే నిల్వ ఉంది. అక్కడి నీటిని జంటనగరాల తాగు నీటి అ వసరాలకు ఉపయోగించనున్నందున నిజాంసాగర్‌కు జలా లు రావడం అనుమానమే.

మరిన్ని వార్తలు