డబ్బా ఇసుక రూ.10

29 Oct, 2019 01:39 IST|Sakshi

మంథని: ఇసుక బంగారమైంది. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో సోమవారం డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదారేశ్వర వ్రతానికి కొత్త ఇసుక అవసరం. గద్దెల నిర్మాణంతోపాటు ఇతర అవసరాలకు ఇసుక వినియోగిస్తారు. గోదావరిలో స్నానం చేసి నదిలో కాసింత ఇసుకను భక్తులు ఏటా తీసుకెళ్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో మంథని వద్ద గోదావరి నిండుగా ఉండి ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఇదే అదనుగా గోదావరి అవతలి వైపు మంచిర్యాల జిల్లా శివ్వారం నుంచి కొంతమంది సంచుల్లో ఇసుకను తీసుకొచ్చి స్నాన ఘట్ల వద్ద ఇలా విక్రయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో భక్తులు కొనుక్కుని వెళ్లారు.

మరిన్ని వార్తలు