పాముకాటుకు బాలుడి మృతి

19 Jul, 2018 14:37 IST|Sakshi
గణేశ్‌ మృతదేహం 

రామన్నపేట(నకిరేకల్‌) యాదాద్రి  :  పాముకాటుకు రెండో తరగతి చదువుతున్న బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మంగళవారం రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేడబోయిన సైదులు–మమత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారు డు గణేశ్‌(8) స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూ డో తరగతి చదువుతున్నాడు.

ఈనెల 16న జ్వరం రావడంతో పాఠశాలకు వెళ్లలేదు. సాయంత్రం తాత ఎల్లయ్య వద్ద మంచంలో పడుకున్నాడు. తెల్లవారుజామున 3గంటల సమయంలో వాంతి చేసుకున్నాడు. నాలుగున్నర గంటల సమయంలో ఉక్కపోస్తుందని తాతకు చెప్పగా ఫ్యాన్‌వేయడం కోసం లైట్‌ ఆన్‌చేసి చూడగా గదిలో మూలకు కట్ల పాము కనిపించింది. ఎల్లయ్య పామును చంపివేశాడు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో తల్లి మమత గణేశ్‌ను నిద్రనుంచి లేపుతుండగా లేవకపోగా ఎటువేస్తే అటు పడిపోయాడు.

తల్లి దండ్రులు భయంతో హుటాహుటిన  నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లగా ఏదో విషపురుగు కాటువేసిందని చెప్పారు.  మెరుగైన వైద్యం కోసం నార్కట్‌పల్లి కామినేని ఆసుప్రతిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ బి.నాగన్న తెలిపాడు. బుధవారం పోస్టుమార్టం అనంతరం గ్రామంలో అం త్యక్రియలు నిర్వహించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు