4 గంటల నరకయాతన.. లిఫ్ట్ గోడలు పగలగొట్టి..

12 Jun, 2019 11:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చందానగర్ పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్‌లో మూడేళ్ల బాలుడు లిఫ్ట్‌లో చిక్కుకున్నాడు. సుమారు నాలుగు గంటలపాటూ నరకయాతన అనుభవించాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 ఉద్యోగులు శ్రమించి బాలుడిని సురక్షితంగా రక్షించడంతో బాలుడు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. దీంతో స్థానికులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. స్వగృహలో అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్ నంబర్ ఈఏ2లో నివాసం ఉండే ఫనీంద్ర చారి కుమరుడు సౌర్యన్ ఆడుకుంటూ లిఫ్ట్‌ ఎక్కాడు. పై వరకు వెళ్లిన లిఫ్ట్ సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. దీంతో సౌర్యన్ అరవడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లిఫ్ట్ గోడలు పగలగొట్టి బాలుడుని రక్షించడంతో నాలుగు గంటల ఉత్కంఠకు తెర పడింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా