ఉదయభాను ఛాలెంజ్‌ స్వీకరించిన బ్రహ్మానందం

27 Jun, 2020 09:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన నివాసంలో మొక్కలు నాటారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ 3వ విడతలో భాగం యాంకర్‌ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆయన స్వీకరించారు. ఇందులో భాగంగా మణికొండలోని తన నివాసంలో శనివారం ఉదయం మొక్కలు నాటి, అందుకు సంబంధించిన ఫోటోలను బ్రహ్మానందం షేర్‌ చేశారు. కాగా  తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. (చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్)

ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్‌ విసురుతున్నారు. కేటీఆర్‌, కవిత, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, ప్రభాస్‌, వీవీ వినాయక్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్‌ స్వీకరించి మరి కొందరికి సవాల్‌ విసిరారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. (ఎన్టీఆర్కు సుమ గ్రీన్ చాలెంజ్)

మరిన్ని వార్తలు