పాపికొండల పర్యాటకానికి బ్రేక్‌

17 May, 2018 04:58 IST|Sakshi

భద్రాచలం: పాపికొండల విహార యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గోదావరి నదిలో లాంచీ మునిగిన ఘటనలో 20 మందికి పైగానే మృత్యువాత పడటం,, ఐదు రోజుల కిందట లాంచీలో పొగలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా పాపికొండల పర్యాటకానికి వెళ్లే లాంచీలను నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు తిప్పాలనే దానిపై తాము స్పష్టత ఇచ్చేంత వరకూ నిర్వాహకులు గోదావరిలో లాంచీలు, పడవలు తిప్పొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో భద్రాచలం వైపు నుంచి పాపికొండల యాత్రకు వెళ్లేందుకు వచ్చిన పర్యాటకులు బుధవారం వెనుదిరిగి వెళ్లారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు