వరుడికి భారీ షాకిచ్చిన పెళ్లి కూతురు!

29 Feb, 2020 09:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పీటల మీద ఆగిన పెళ్లి

కొత్తకోట రూరల్‌: జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో తనకు పెళ్లి ఇష్టం లేదని వధువు పెళ్లికి నిరాకరించింది. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం చర్లపల్లిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని పామాపురం గ్రామానికి చెందిన నందిని అదే మండలం చర్లపల్లికి చెందిన వెంకటేశ్‌ల పెళ్లి శుక్రవారం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. ఉదయం 8.10 గంలకు ముహూర్తం ఉండటంతో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. తీరా జీలకర్ర బెల్లం పెట్టే సమయానికి నందిని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో పెళ్లికి వచ్చినవారందరూ అవాక్కయ్యారు. నందినిని ఆమె మేనబావ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఈ వివాహానికి నిరాకరించిందని నిర్ధారణకు వచ్చిన వరుడి బంధువులు వధువు మేనబావపై దాడికి దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు వచ్చి, జరిగిన విషయం తెలుసుకుని అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని ఇరు కుటుంబాలకు సర్ది చెప్పారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు