వరద తాకిడికి కొట్టుకుపోయిన వంతెన

3 Jul, 2020 09:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గురువారం రాత్రి హైదరాబాద్‌ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు పడ్డాయి. వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు వంకలు పెంగిపొర్లాయి. భారీ వర్షం కారణంగా వరద పోటెత్తడంతో కాగ్నా నది తీవ్ర రూపం దాల్చింది. వరద తాకిడికి కొండగల్‌-తాండూర్‌ మార్గం మధ్యలో తాత్కాలికంగా నిర్మించిన వంతెన కొట్టుకుని పోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ధారూర్, కుల్కచర్ల, పెద్దేముల్ మండలాల్లో భారీగా వర్షం కురవడం వరద ఎక్కువగా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం
వికారాబాద్ జిల్లా పెద్దేముల్లో 17.2 సెం.మీ వర్షపాతం
మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడలో 17 సెం.మీ వర్షపాతం
మహబూబ్‌నగర్‌లో 13.9 సెం.మీ వర్షపాతం
మహబూబాబాద్‌లో 13.6 సెం.మీ వర్షపాతం
సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లెలో 11 సెం.మీ వర్షపాతం
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో 10.2 సెం.మీ వర్షపాతం
వికారాబాద్ జిల్లా ధారూర్‌లో 9.2 సెం.మీ వర్షపా
తం
 

మరిన్ని వార్తలు