ఆరేళ్లలో విద్యకు 4.13 శాతం తగ్గిన బడ్జెట్‌  

10 Sep, 2019 03:46 IST|Sakshi

10.88 శాతం నుంచి 6.75 శాతానికి పడిపోయిన వైనం

ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పక మార్పు వస్తుందనే ఆశాభావం నాకుంది. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు కూడా మనకు ఉంది.
– కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు ఏటేటా తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యాసంస్థలకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు క్రమంగా పడిపోతున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు 4.13 శాతం మేర తగ్గిపోయాయి. ఆ ప్రభావం విద్యారంగంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైనా పడుతోందన్న విమర్శలున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో 10.88 శాతం కాగా, ఇపుడు అది 6.75 శాతానికి పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్‌లో వాటా తగ్గినా నిధులపరంగా కొంత బాగానే ఉంది.

2016–17 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రాష్ట్ర బడ్జెట్‌ పెరిగినా, విద్యాశాఖ వాటా పెరగక పోగా తగ్గింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ. 1,00,637 కోట్లు కాగా, విద్యాశాఖకు రూ.10,963 కోట్లు (రాష్ట్ర బడ్జెట్‌లో 10.88 శాతం) కేటాయించింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,15,689 కోట్లు కాగా విద్యాశాఖకు రూ.11,216 కోట్లు (9.69 శాతం) కేటాయించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,30,415 కోట్లకు పెరగగా, విద్యాశాఖ బడ్జెట్‌ మాత్రం రూ.10,738 కోట్లకు తగ్గిపోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర బడ్జెట్‌ 1,49,453 కోట్లకు పెరిగింది. అందులో విద్యాశాఖకు నిధులు పెరిగాయి. విద్యాశాఖ బడ్జెట్‌ రూ.12,278 కోట్లకు పెరిగినా రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా చూస్తే 8.49 శాతానికే పరిమితమైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ 1,74,453 కోట్లు కాగా విద్యాశాఖకు రూ.13,278 కోట్లు కేటాయించింది. ఈసారి ఆర్థిక మాంద్యం ప్రభావం మరింతగా తగ్గించి రూ.9,899.82 కోట్లకు పరిమితం చేసింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పుతోనే ‘సాగు’తుంది!

వృద్ధి రేటు ‘పది’లమే

ఆర్టీసీకి రూ.500 కోట్లే..! 

హరీశ్‌.. తొలిసారి 

మాంద్యంలోనూ సం'క్షేమమే'

బంగారు తెలంగాణను నిర్మిద్దాం

వ్యాధుల నివారణకు క్యాలెండర్‌

22 వరకు అసెంబ్లీ

అలకలు.. కినుకలు

మాంద్యం ముప్పు.. మస్తుగా అప్పు

అజ్ఞాతంలోకి జోగు రామన్న

నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తివేత

రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి గవర్నర్‌ తొలి ప్రసంగం

ఈనాటి ముఖ్యాంశాలు

ఎంఐఎంను ప్రతిపక్షంగా ఎలా గుర్తిస్తారు ?

15 రోజుల్లో డెంగీని అదుపులోకి తెస్తాం : కేటీఆర్‌

జబర్దస్త్‌లోని ఆ సన్నివేశాలను తొలగించాలి 

‘విక్రమ్‌’ జాడను కనుక్కోవచ్చేమో గానీ..: విజయశాంతి

అమర వీరులను కేసీఆర్‌ అవమానిస్తున్నారు

టీ.బడ్జెట్‌.. పైన పటారం..లోన లొటారం..

ఆ పథకాల కోసం ప్రజాధనాన్ని వృధా చేయం!

కేసీఆర్‌ తీరుతో రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం..

సీఎం బడ్జెట్‌ ప్రసంగంలో ఆ అంశాలే లేవు : భట్టి

మున్సిపల్‌ అధికారులతో కేటీఆర్‌ సమీక్ష

ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌ కాన్‌స్టిస్ట్యూషనల్‌ క్లబ్‌

కేసీఆర్‌ మాట తప్పారు: నాయిని

కేసీఆర్‌ మజ్లిస్‌కు తొత్తుగా మారాడు: లక్ష్మణ్‌

తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట

తెలంగాణ బడ్జెట్‌ అంచనాలు ఇవే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా పెళ్లి తిరుపతిలోనే...

వంట నేర్చుకోను

ప్రేమకథ మొదలు

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?