తెలంగాణలో పెరిగిన రాజ్యహింస

16 Aug, 2017 01:45 IST|Sakshi
తెలంగాణలో పెరిగిన రాజ్యహింస

యాదగిరిగుట్ట :  తెలంగాణ రాష్ట్రంలో రాజ్యహింస పెరిగిపోయిందని, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలో కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయడమే దీనికి నిదర్శనమని ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ ఆరోపించారు. యాదగిరి గుట్టలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన రోజు నే అరెస్టులు చేయడం ఇది ప్రజాస్వామ్యమా.. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిం చారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఇక్కడి ప్రజలు బాగుపడుతారనుకుంటే.. బాధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం లో నయా నవాబు, దొరల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.

 అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో గొల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసి, ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రసంగించిన కేసీఆర్‌.. నాలుగేళ్లైనా ఇప్ప టి వరకు ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట తప్పారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో 4,860 పాఠశాలలను మూసివేసి గ్రామీణ ప్రాంతా విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. కాంట్రా క్టర్లు, కమిషన్ల కోసమే ఈ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందన్నారు. తెలం గాణలో కేసీఆర్‌ కుటుం బం, టీఆర్‌ఎస్‌ నాయకులే బాగుపడుతున్నారని, ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారని చెప్పారు.  

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి, అధికారంలో వస్తామని, అప్పు డు సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందే విధంగా కృషిచేస్తామన్నారు. సూర్యాపేటలో అరెస్టు చేసిన కాంగ్రెస్‌ నాయకులు వెంటనె విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ వైస్‌ ప్రసిడెంట్‌ కలకుంట్ల బాల్‌నర్సయ్య, ప్రధాన కార్యదర్శి సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జి గుడ్ల వరలక్ష్మి, మండల, పట్టణ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య, గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు సుడుగు జీవన్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గుండ్లపల్లి నర్సింహగౌడ్, నాయకులు తంగళ్లపల్లి సుగుణాకర్, గాంధీ, రాజేష్, రాజిరెడ్డి, నర్సయ్య, గుజ్జ శ్రీనివాస్, శ్రీశైలం తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు