అర్ధరాత్రి దొంగల బీభత్సం

10 Aug, 2014 03:24 IST|Sakshi
అర్ధరాత్రి దొంగల బీభత్సం

బీబీనగర్ :అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడిచేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్తకు తీవ్రగాయాలయ్యా యి. బీబీనగర్ మండల కేంద్రంలో శనివారం ఈ దారుణం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
 
 అప్పటి వరకు కబుర్లు చెప్పుకుని..
 మండల కేంద్రానికి చెందిన ఖాజామియాకు అబ్జల్, ఖాజాఅసమొద్దీన్, హాజీ, బాబాజాన్, జానీపాషా అనే ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరిలో హాజీ హైదరాబాద్‌లో నివసిస్తుండగా మిగతా నలుగురు మండల కేంద్రంలోని రైల్వే కాలనీలో ఇటీవల ఓ పెద్ద గృహాన్ని నిర్మించుకుని వేర్వేరు గదుల్లో నివసిస్తున్నారు. చివరి సంతానమైన జానీపాష వృత్తి రీత్యా గూడూరులోని టోల్‌ప్లాజాలో పనిచేస్తున్నాడు. శుక్రవారం తన విధులను ముగించుకుని ఇంటికి వచ్చాడు. అనంతరం సోదరులంతా రాత్రి పదిగంటలవరకు కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. రాత్రి పదిగంటలకు భోజనాలు చేసి పడుకున్నారు.
 
 సోదరుల గదులకు గడియపెట్టి
 అర్ధరాత్రి దాటిన తరువాత నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు రైల్వే కాలనీలో నివాసిస్తున్న వీరి ఇంటికి వచ్చారు. తొలుత జానీపాష సోదరుల ఇంటి గదులకు గడియపెట్టా రు. అనంతరం జానీపాష గది ద్వారానికి పక్కనే ఉన్న కిటికి తెరిచి ఉండడంతో అందులోనుంచి కర్రసాయంతో తలుపు గడియతెరిచి లోనికి ప్రవేశించారు. అనంతరం బెడ్‌రూంలోకి చొరబడి బీరువాను తెరుస్తుడగా శబ్దం రావడంతో జానీ పా ష, అతడి భార్య షాజియా లేచి దుండగులను చూసి ఎదురు తిరిగారు. దీంతో వారు కర్రమొద్దుతో షాజీయాను(22) మంచంపై పడవేసి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆపై జానీపాషను విచక్షణా రహితంగా కొట్టడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం బీరువాలో ఉన్న నగలతో పాటు, షాజీయా ఒంటిపై ఉన్న 3 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
 
 హత్య జరిగిన గంట తరువాత
 ఒకే ఇంటిలో వేర్వేరు గదుల్లో నివాసాముంటున్న జానీపాష సోదరులు దుండగుల దాడి సమయంలో మేల్కోలేకపోయారు.ఘటన జరిగిన గంట తరువాత ఒంటిగంట సమయంలో జానీపాష వదిన నసీమా బాత్‌రూం వెళ్లడానికి తలుపు డోరు తీయగా ఎంతకూ వెళ్లకపోవడంతో భర్తను లేపి ంది. బయట నుంచి గడియపెట్టి ఉం డడంతో ఇద్దరు వెనుక డోర్ నుంచి బయటకు వచ్చి చూడగా జానీపాష ఇంట్లోని వస్తువులు బయట వేసి ఉన్నాయి. దీం తో లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న షాజీ యాను, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న జానీని చూసి నివ్వెరపోయి పెద్ద పెట్టున కేకలు వేశారు. దీంతో ఇంటి మేడపై గదిలో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులతో పాటు స్థాని కులు అక్కడకు చేరుకున్నారు. షాజీయా, జానీపాషను ఆటో లో గూడూరు వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో భువనగిరి ఏరి యా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే షాజియా మృతిచెం దిందని వైద్యులు ధ్రువీకరించారు. పరిస్థితి విషమంగా ఉన్న జానీపాషను ఉప్పల్‌లో ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం 108 సిబ్బం ది విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
 
 సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
 దుండగుల దాడి విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ ప్రభాకర్‌రావు తెల్లవారుజామున 4గంటలకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను గంటపాటు విచారిం చారు. అనంతరం నల్లగొండ నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి హత్యాస్థలంలో ఆధారాలు సేకరిం చారు. ప్రొఫెషనల్ కిల్లర్స్ పని అయి ఉండవచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో కేసు ను దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చా రు. ఆయనతో పాటు భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు నరేందర్, సత్తీష్‌రెడ్డి, ఎస్‌ఐలు దేవేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌లు ఉన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరేందర్ తెలిపారు.

 

మరిన్ని వార్తలు