ఖాకీలకు చుక్కలు చూపించిన మహిళ

29 Jun, 2015 08:48 IST|Sakshi
ఖాకీలకు చుక్కలు చూపించిన మహిళ

హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని కళింగ చౌరస్తాలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో ఓ మహిళ వ్యాపారవేత్త పోలీసులకు చుక్కలు చూపించింది. బంజారాహిల్స్ రోడ్‌నెం.3లో నివసించే యువ వ్యాపారవేత్త మద్యం తాగి తన ఆడికారు నడుపుకుంటూ వస్తుండగా బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆపేందుకు యత్నించగా వేగంగా ముందుకు పోనిచ్చింది. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.

శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు యత్నించగా ఆమె అడ్డుకోవడమే కాకుండా ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న మీడియాపై కూడా చిందులు తొక్కింది. అతికష్టం మీద పోలీసులు ఆమెకు శ్వాస పరీక్ష నిర్వహించగా పరిమితికి మించి మద్యం తాగి ఉన్నట్టు నిర్థారణైంది. దీంతో కేసు నమోదు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.

కాగా, శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు చేపట్టిన డ్రంకన్ డ్రైవ్‌లో అతిగా మద్యం తాగి వాహనం నడుపుతున్న 20 మందిపై కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 10 కార్లు, 9 బైక్‌లు, ఒక ఆటో ట్రాలీ ఉన్నాయి. పట్టుబడ్డ వాహనదారులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తామని సీఐ ఉమా మహేశ్వరరావు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు