‘ఖరీఫ్‌ కంది 75% కొనుగోలు చేయండి’ 

27 Aug, 2018 01:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఖరీఫ్‌లో సాగవుతున్న కంది ఉత్పత్తిలో 75% మేర కేంద్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ కోరనుంది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి హరీశ్‌రావు త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నారు. కేంద్ర అర్థ, గణాంక శాఖ ముందస్తు అంచనాల ప్రకారం మద్ద తు ధరకు కొనుగోలు పథకం కింద సేకరణకు అనుమతినిస్తుంది. దీని ప్రకారం మొత్తం ఉత్పత్తిలో 40% మాత్రమే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఈ ఖరీఫ్‌లో రైతులు కందులు 6.57 లక్షల ఎకరా ల్లో వేశారు.

ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందుగానే కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిసింది. గతేడాది కంది సాగు విస్తీర్ణం 7.28 లక్షల ఎకరాలు కాగా, దిగుబడి 2.84 లక్షల టన్నులుగా ఉంది. మొదటి ముందస్తు అంచనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్న కేంద్రం కేవలం 75,300 క్వింటాళ్లకే అనుమతించింది. తర్వాత రాష్ట్రమే రైతుల నుంచి క్వింటాకు రూ.5,450 మద్దతు ధర తో 1.13 లక్షల మెట్రిక్‌ టన్నులు మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.   

మరిన్ని వార్తలు