తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

16 Jun, 2015 04:02 IST|Sakshi
తాను చనిపోతూ ఐదుగురికి ప్రాణదానం

పంజగుట్ట: తాను మరణిస్తూ ఓ యువకుడు తన అవయవాలు దానం చేసి మరో ఐదుగురికి ప్రాణదానం చేశాడు. నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనూరాధ తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలానికి చెందిన సోమేశ్ చారి (35) ప్రైవేట్ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈనెల 4న నల్లగొండలో ద్విచక్రవాహనంపై వెళ్తూ సోమేశ్ చారి ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు నగరంలోని కిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న సోమేశ్‌చారికి ఈనెల 11 న బ్రైయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి జీవన్‌దాన్ ప్రతినిధులు చారి కుటుంబసభ్యులను కలిసి అవయవదానం ఆవశ్యకతను వివరించారు. వారు ఒప్పుకోవడంతో సోమేశ్‌చారికి శస్త్రచికిత్స చేసి అతని శరీరంలో నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు హార్ట్‌వాల్వ్స్ సేకరించి అవసరమైన వారికి అమర్చారు.

మరిన్ని వార్తలు