తెలంగాణ ఎయిమ్స్‌కు కేంద్రం ఆమోదం

17 Dec, 2018 22:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ఫలించింది. ఎట్టకేలకు తెలంగాణలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నల్గొండ జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి స్వాస్థ్ సురక్ష యోజన కింద.. ఎయిమ్స్‌ను మంజూరు చేసింది.  ఎయిమ్స్‌ ఏర్పాటుకు రూ. 1028 కోట్ల ఖర్చు అవుతున్నట్లు అంచనా వేసింది. మెడికల్ కాలేజీలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. 15-20 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 750 పడకలతో ఎయిమ్స్ ఏర్పాటు కానుంది. ఎయిమ్స్ లో 1500 ఓపీ, 1000 మంది ఇన్ పేషెంట్లకు నేరుగా చికిత్స అందే అవకాశముంది. ఎయిమ్స్ లో ఎమర్జెన్సీ, ట్రామా, ఆయుష్, ఐసీయూ, సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలు ఉండనున్నాయి. మెడికల్ కాలేజీ సహా ఇతర సదుపాయాలన్నీ 45 నెలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తలు