‘క్యాప్చినో’ పరిచయం చేసింది సిద్దార్థే..

1 Aug, 2019 09:58 IST|Sakshi

హైదరాబాద్‌ నగరంలో 70 అవుట్‌లెట్స్‌  

తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య సుమారు 100  

ఒక్కోదానిపై రోజుకు రూ.15 వేల ఆదాయం

రెండు రాష్ట్రాల్లో నెలకు రూ.4.5 కోట్ల టర్నోవర్‌

ఒక్క హైదరాబాద్‌లోనే రూ.3.15 కోట్లకుపైగా రాబడి  

సిటీలో 400 మంది సిబ్బందికి ఉపాధి   

దేశానికి ‘క్యాప్చినో’ని పరిచయం చేసిన వీజీ సిద్ధార్థ

కేఫ్‌ కాఫీ డే రుచులను గుర్తు చేసుకున్న నగరవాసులు  

కాఫీలో దిగ్గజం కేఫ్‌ కాఫీ డే. కేఫ్‌ కాఫీడేలో ఒక్క కాఫీ తాగితే చాలు ఆ కిక్కే వేరు. తెలుగు రాష్ట్రాల్లో 100కిపైగా అవుట్‌లెట్స్‌ని కలిగిఉన్న కేఫ్‌ కాఫీడేకు నగరంలో 70 వరకు అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. అత్యంత రద్దీ ప్రదేశాల్లో, షాపింగ్‌ మాల్స్, ఐటీ కారిడర్‌కు సమీపంలో టెక్కీలను దృష్టిలో పెట్టుకుని అవుట్‌లెట్స్‌ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకు సుమారు రూ. 4.5 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఒక్క హైదరాబాద్‌లోనే దీని టర్నోవర్‌ రూ.3.15 కోట్లకుపైగా ఉండటం గమనార్హం. భారతదేశంలో ‘క్యాప్చినో’ (కాఫీ)ని పరిచయం చేసిన కేఫ్‌ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో కాఫీ లవర్స్‌ ఒకింత ఆవేదనకు గురయ్యారు.  

హైదరాబాద్‌ సిటీలో కేఫ్‌ కాఫీడేకు 70 అవుట్‌లెట్స్‌ ఉండగా, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో సుమారు 30కిపైగా అవుట్‌లెట్స్‌ ఉన్నాయి. 37 ఏళ్ల క్రితం ‘కేఫ్‌ కాఫీడే’ పేరుతో వీజీ సిద్ధార్థ దేశానికి ‘క్యాప్చినో’ (కాఫీ)ని పరిచయం చేశారు. దీని ధర రూ.135. కాఫీతో పాటు ప్రతి రోజూ కాఫీ, పిజ్జా, బర్గర్, స్నాక్స్, కూల్‌కాఫీ, మిల్క్‌షేక్స్‌ వంటి వాటితో రోజుకు ఒక్కో షాప్‌పై సుమారు రూ.15వేల ఆదాయం వస్తోంది. ఇలా హైదరాబాద్‌ సిటీ వ్యాప్తంగా ఉన్న 70 అవుట్‌లెట్స్‌ నుంచి నిత్యం సుమారు రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు రెండు రాష్ట్రాల నుంచి సుమారు రూ.4.5కోట్లు వస్తుండగా.. ఒక్క హైదరాబాద్‌ సిటీ నుంచే సుమారు రూ.3.15 కోట్లకుపైగా ఆదాయం రావడం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.  

400 మందికి ఉపాధి..
రెండు తెలుగు రాష్ట్రాల్లోని కేఫ్‌ కాఫీ డే అవుట్‌లెట్స్‌లో సుమారు 400 మందికిపైగా ఉద్యోగులు జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో బ్రాంచ్‌లో నలుగురు లేదా ఐదుగురు చొప్పున విధులు నిర్వర్తిసున్నారు. వీరికి కనీస వేతనం రూ.8వేలు నుంచి రూ.60, 70వేలు సంపాదించే వాళ్లూ ఉన్నారు. నెలసరి జీతం, ఇతర అలవెన్స్‌ వంటివి ఏవీ కూడా ఇంత వరకు నిలిపివేసిన ఘటనలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి నెలా మొదటి రోజునే తమకు వేతనాలు ఆన్‌లైన్‌ ద్వారా వచ్చేస్తాయని వివరించారు. తమ యజమాని సిద్ధార్థకు కోట్లాది రూపాయలు అప్పు ఉందనే విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యామంటున్నారు. 

నాగార్జున సర్కిల్‌లో మొదటిసారిగా..  

బంజారాహిల్స్‌: అది 2004 ఆగస్ట్‌ 16. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–1/3 చౌరస్తాలోని నాగార్జున సర్కిల్‌లో కొత్తగా తెరుచుకుంది కేఫ్‌ కాఫీ డే. అప్పటికి నగరవాసులకు కాఫీ రుచులు ఇన్ని ఉన్నాయన్న విషయం తెలియదు. కాఫీ కెఫె పేరుతో ఓ హోటల్‌ తెరచుకోవడమే అప్పట్లో సంచలనం. ఇక్కడ కాఫీ అంటే వేడివేడిగా గ్లాసులో పొగలు కక్కడమే తెలుసు. దీని యజమాని సిద్ధార్ధ మాత్రం మొదటిసారిగా కోల్డ్‌ కాఫీని రుచి చూపించారు. యువత కోల్డ్‌ కాఫీకి ఫిదా అయిపోయారనే చెప్పాలి. మొట్టమొదటి కేఫ్‌ కాఫీ డే నగరంలో నాగార్జున సర్కిల్‌లోనే తెరుచుకుంది.

ఆ తర్వాత ఏడాదికి ఒకటి, రెండు చొప్పున పాష్‌ లొకాలిటీలలో వీటిని విస్తరించారు. కాఫీకి కొత్త రుచులను పరిచయం చేసిన కేఫ్‌కాఫీ డేలోకి వెళ్లి వివిధ రకాల కాఫీ రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు అలవాటు పడ్డారు. దీంతో ఈ 15 సంవత్సరాల్లో మొత్తం 21 ఫ్రాంచైజీలు నగరవ్యాప్తంగా ఏర్పాటయ్యాయి. నాగార్జున సర్కిల్‌లో ప్రారంభమైన మొదటి కాఫీ డే ఆ తర్వాత రెండోది జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌– 36లో ఏర్పాటైంది.

ప్రస్తుతం నెక్లెస్‌ రోడ్, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–14, రాజ్‌భవన్‌ రోడ్డు, కుందన్‌బాగ్, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–10, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–36, 47, ఉస్మానియా యూనివర్సిటీ, లక్డీకాపూల్, ఎల్బీనగర్, ఎస్‌ఆర్‌నగర్, వారాసిగూడ, బేగంపేట, సింధీకాలనీ, శ్రీనగర్‌కాలనీ, సోమాజిగూడ, ప్రసాద్‌ ఐమాక్స్, జీవీకే వన్‌ మాల్, హైదరాబాద్‌ సెంట్రల్, అపోలో ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో విస్తరించుకుంది. దాదాపు అన్ని కాఫీ షాపులు నగరవాసుల ఆదరణను చూరగొన్నాయి.  

ఒకేసారి 76 మంది కూర్చునేలా..
ప్రస్తుతం 21 ఫ్రాంచైజీల్లో కొనసాగుతున్న కాఫీ రుచులకు నగరవాసులు బాగానే అలవాటు పడ్డారని చెప్పొచ్చు. యువతీయువకుల కలయికకు ఈ కేఫ్‌ కాఫీ డేలు వేదికలుగా మారాయి. ఒక్కో కాఫీ షాపులో 42 రకాల రుచులతో కాఫీలను విక్రయిస్తున్నారు. ఎక్కువగా సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేశారు. కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేఫ్‌ కాఫీ డే యజమాని సిద్ధార్థ హైదరాబాద్‌లో మొదటి ఫ్రాంచైజీని ఏర్పాటు చేసినప్పుడు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. గత ఏప్రిల్‌ 6న జూబ్లీహిల్స్‌లో కాఫీ డే స్క్వేర్‌ పేరుతో గ్లోబల్‌ రుచులను అందించేందుకు సరికొత్త రెస్టారెంట్‌ ఏర్పాటు చేశారు. ఒకేసారి 76 మంది అతిథులు కూర్చొనేందుకు వీలుగా దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. 

ఎంతోమంది అభిమానాన్ని చూరగొని..
దేశానికి క్యాప్చినోని పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు కేఫ్‌ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ. కస్టమర్లను గంటలతరబడి కేఫ్‌ కాఫీ డేలో కూర్చోబెట్టేలా చేశారు ఆయన. టైంపాస్‌ కోసమైనా,సరదాగా ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌కైనా కేఫ్‌ కాఫీ డే కేరాఫ్‌ అనే చెప్పాలి. మొదట్లో సంపన్న వర్గాల వారికే పరిమితమైన కాఫీ డే క్రమేణా ఐదేళల్లో మధ్యతరగతి ప్రజానీకానికి కూడా చేరువయ్యింది. 42కిపైగా రుచులను కాఫీడే అందించడం విశేషం. వేడి వేడి క్యాప్చినోని సిప్‌ వేస్తే మైండ్‌ రిఫ్రెష్‌ అవుతుందనేది కాఫీలవర్స్‌ అభిప్రాయం. తమకు ఇంతటి చక్కటి కాఫీని అందించిన సిద్ధార్థ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నామని నగరానికి చెందిన కాఫీ లవర్‌ మహిమ పేర్కొన్నారు.  

గచ్చిబౌలిలో యథావిధిగా..  
గచ్చిబౌలి: కేఫ్‌ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. కాగా బుధవారం గచ్చిబౌలిలోని కేఫ్‌ కాఫీ డే అవుట్‌లెట్‌ యథావిధిగా కొనసాగింది. తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో కేఫ్‌ కాఫీ డేను యథావిధిగా తెరిచినట్లు ఇక్కడి ఉద్యోగులు తెలిపారు. కేఫ్‌కు రోజు మాదిరిగానే వినియోగదారులు వచ్చి వెళ్లారు. కేఫ్‌ కాఫీ డే అధినేత సిద్ధార్థ మృతిపై మాట్లాడేందుకు సిబ్బంది నిరాకరించారు.

సిద్ధార్థ మృతి బాధాకరం..
వివిధ పనులతో అలసిపోయిన నేను, నా స్నేహితులు ప్రతిరోజూ బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌ సమీపంలోని కేఫ్‌ కాఫీ డేకి వస్తాం. మా డెయిలీ బాతాఖానీ ఇక్కడే. క్యాప్చినోని ఆరగిస్తూ.. నచ్చిన చిప్స్, బిస్కెట్స్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తాం. క్యాప్చినోను దేశానికి పరిచయం చేసిన వీజీ సిద్ధార్థ మృతి ఎంతో బాధాకరం.  – భరత్, కాఫీ లవర్‌  

డెయిలీకస్టమర్లం..
కాఫీ డే అప్పుల్లో ఉన్న విషయం అసలు తెలీనే తెలీదు. కాఫీడేలోకి అడుగుపెట్టగానే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. 2009 నుంచి కాఫీడేకి నేనూ, నా స్నేహితులం డెయిలీ కస్టమర్లం. వీజీ సిద్ధార్థ చనిపోయాడని మేనేజ్‌మెంట్‌ను చేంజ్‌ చేస్తే కాఫీ డే కుప్పకూలిపోవచ్చు.– కృష్ణయాదవ్,     కాఫీ లవర్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొంగరకలాన్‌లో దర్జాగా కబ్జా! 

త్వరలోనే కోర్టా– చనాక బ్యారేజీ ప్రారంభం

'ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనం లూటీ'

విత్తనోత్పత్తి అంతా ఉత్తిదే..!

వంతెన.. ఇంతేనా..? 

మరో పోరాటానికి పసుపు రైతులు సిద్ధం

వరంగల్‌.. బెల్లం బజార్‌ !

కేసీఆర్‌, కేటీఆర్‌లకు గుత్తా ధన్యవాదాలు

ఎస్సారెస్పీ ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు

గోదారి తగ్గింది..

నోటుకో ప్రత్యేకత..!

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 70శాతం సిజేరియన్లే..

ఆపరేషన్‌ ముస్కాన్‌లో ‘సై’

తెగని పంచాయితీ..

త్వరితం.. హరితం

సర్కారీ స్థలం.. వివాదాస్పదం!

బావిలో నక్కల జంట

ధార లేని మంజీర

‘నేను కేన్సర్‌ని జయించాను’

మెదక్‌లో ‘జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌’

టిక్‌టాక్‌ మాయ.. ఉద్యోగం గోవిందా!

పాలు పోయొద్దు .. ప్రాణాలు తీయొద్దు

రాళ్లపై 'రాత'నాలు

వికారాబాద్‌లో దారుణం

కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య 

నాగోబా..అదరాలబ్బా 

హరిత పార్కులు ఇవిగో: కేటీఆర్‌

ఒకేసారి 108 పోతరాజుల విన్యాసాలు

రిజర్వేషన్ల సాధనే లక్ష్యం  

వైద్య రిజర్వేషన్లపై గందరగోళం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పోసానితో నాకెలాంటి విభేదాలు లేవు...

‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’

‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’

బిగ్‌బాస్‌లో సెలబ్రేషన్స్‌​.. ఎలిమినేషన్స్‌​.. ఎమోషన్స్‌

వీడియో వైరల్‌..  రణ్‌వీర్‌పై ప్రశంసల జల్లు

వారం రోజులపాటు ఆశ్రమంలో