9... నెమ్మది!

23 Sep, 2019 02:37 IST|Sakshi

ప్రభుత్వ శాఖల పనితీరుపై కాగ్‌ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై కాగ్‌ పెదవి విరిచింది. బడ్జెట్‌ కేటాయింపులకు తగినట్లుగా నిధు లు వాడుకోకపోవడాన్ని తప్పుబట్టింది. 2017–18 ఆర్థిక సం వత్సరానికి సంబంధించిన నివేదికను కాగ్‌ ఆదివారం శాసనసభ ముందుంచింది. ఆర్‌ అండ్‌ బీ, ఉన్నత విద్య, వైద్య, ఆరోగ్య, పురపాలన, గృహనిర్మాణ, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, భారీ, మధ్య తరహా నీటిపారుదల, వాణిజ్య, పరి శ్రమల శాఖలు నిధులు వాడుకోకపోవడంతో మురిగిపోయాయని తేల్చింది. నిధులు ఖర్చు పెట్టని శాఖల్లో మున్సిపల్‌ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. నిధులను సద్వినియోగం చేసుకోని ఈ శాఖలను నిధులు పొదుపు చేశారంటూ కాగ్‌ ఎద్దేవా చేసింది. నిధులు వాడుకోకపోవడం వల్ల ప్రభుత్వ పథకాల అమలు, లక్ష్యసాధనలో వెనుకబడ్డాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు