కెమెరాకు చిక్కిన చిరుతలు

31 Mar, 2018 07:41 IST|Sakshi
పశు కళేబరాన్ని తింటున్న చిరుతలు

ఆసిఫాబాద్‌ : రెండు చిరుత పులులు పశుకళేబరాన్ని తింటూ కెమెరాకు చిక్కాయి. కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌ పరిధిలోని సిర్పూర్‌ రేంజి ప్రాంతంలో ఈ నెల 28న రెండు చిరుతలు పశు కళేబరాన్ని తింటూ అటవీ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కాయి. సాధారణంగా చిరుతలు ఒంటరిగా వేటాడడం, సంచారిస్తుంటాయని ఏదైనా వేటాడిన జంతువును రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి స్వీకరస్తాయని కాగజ్‌నగర్‌ డివిజన్‌ అటవీ అధికారి ఎన్‌.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా ఇలా రెండు చిరుతలు ఎక్కడా ఒక చోట వేటాడడం ఉండదని ఇది అరుదని తెలిపారు. అయితే ఈ రెండు ఒకే తల్లి పిల్లలు లేక జత కట్టిన చిరుతలు అయితేనే ఇలా ఒక చోట ఉంటాయన్నారు. గతేడు డిసెంబర్‌లోనూ మూడు చిరుతలు ఒకె కెమెరాలో కన్పించాయని ఆయన గుర్తుచేశారు. చనిపోయిన పశువు యాజమానికి నష్టపరిహారం అటవీ శాఖ నుంచి చెల్లిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు