ఆ గ్రామంలో పెరుగుతున్న క్యాన్సర్, కిడ్నీ మరణాలు

19 Sep, 2019 11:18 IST|Sakshi
క్యాన్సర్‌ వ్యాధితో మంచం పట్టిన దుర్గం పోశమ్మ; కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న అర్జునే మలేన్‌బాయి

శంకర్‌గూడకు ఏమైంది..?!

15ఏళ్లలో 16 మంది క్యాన్సర్‌తో మరణం

కిడ్నీ వ్యాధితో మరో ముగ్గురు మృతి

ఆందోళన చెందుతున్న గ్రామస్తులు

సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్‌): మండలంలోని శంకర్‌గూడ గ్రామస్తులను క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు పట్టి పీడీస్తున్నాయి. 15 ఏళ్లుగా గ్రామంలో సాధారణ మరణాల కంటే క్యాన్సర్, కిడ్నీ మరణాలే అధికంగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్, కిడ్నీ వ్యా ధులతో తక్కువ వయస్సు ఉన్న వారు మృతి చెందుతుండడంతో శంకర్‌గూడ గ్రామస్తులు భ యాందోళనకు గురవుతున్నారు. అంతేకా కుం డా వ్యాధులు రావడానికి కారణాలు తె లియక సతమతమవుతున్నారు. మరణాలపై దృష్టి సారించాల్సిన వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

గత 15 ఏళ్లలో క్యాన్సర్‌తో 16 మంది.. 
మండలంలోని శంకర్‌గూడ గ్రామ జనాభా సుమారు 450. గిరిజన గిరిజనేతర 95 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో గడిచిన 15 సంవత్సరాల కాలంలో వావల్కార్‌ లలితబాయి (45), గుట్టె ప్రకాష్‌(52), గుట్టె రామరావ్‌(62), దేవ్‌కతే అంజనాబాయి (45), అబ్దుల్‌ హక్‌(40), జాధవ్‌ దర్గాజీ (60), గుబ్నార్‌ నిలాబాయి(45), కోరెంగా మెగ్‌నాథ్‌(41), వవాల్‌కర్‌ లలిత(40), మదినే ముక్తబాయి (60), పెం దోర్‌ శ్యామ్‌బాయి(45), ఆడ కర్ణుబాయి(50)లు క్యాన్సర్‌ వ్యాధితో మృతి చెందడంతో పాటు ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకు, కోడలు జవాదే బార్జబాయి(60), జవాదే బా లాజీ(42), జవాదే శకుంతలబాయి(40)లు సహితం క్యాన్సర్‌ బారిన పడి మృతి చెందారు. కాగా ఈ నెల 12న గుబ్నార్‌ సతీష్‌(34)లు క్యా న్సర్‌తో మృతి చెందాడు. వీరే కాకుండా పలు వురు క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్నారు. దుర్గం పోశమ్మబాయి(60) క్యాన్సర్‌ వ్యాధితో మంచం ప ట్టగా, వవాల్‌కార్‌ గాయబాయి(50) క్యాన్సర్‌ బారిన పడి హైదరాబాద్‌ యశోధ ఆస్పత్రిలో చి కిత్స పొందుతున్నారు.

కిడ్నీ వ్యాధితో ముగ్గురు మృతి..
అదేవిధంగా కిడ్నీ వ్యాధితో కుడా ఇప్పటి వరకు చరక్‌ వెంకటి(45), జయబాయ్‌ కొండబాయి(50), వవాల్‌కర్‌ సందిపాన్‌(45)లు మరణిం చారు. చరక్‌ విష్ణుకాంత్‌(40), మదినే ప్రేమ్‌బా యి(50), అర్జునే మలాన్‌బాయి(52), పాండ్గే రుఖ్మబాయి(48)లు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కొందరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరి ఆరో గ్యం విషమించి గ్రామంలో మంచాలకు పరి మితమయ్యారు. తక్కువ వయస్సులోనే అనేక మంది మృతి చెందడంతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయని వాపోతున్నారు. 

వ్యాధులు రావడానికి కారణాలు..?
క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు రావడానికి అసలు కారణాలు తెలియకపోవడంతో శంకర్‌గూడ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే గ్రామంలో వ్యాధులు రావడానికి ముఖ్యంగా చేతిపంపుల కలుషిత నీరే కారణమని, గ్రామంలో ఉన్న చేతి పంపుల్లో సున్నపు (తెల్లని) రంగుతో కూడిన బురద నీరు వస్తుందని, ఆ నీరు తాగిన వారు అనారోగ్యానికి గురి కావడంతో పాటు క్యాన్సర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని, పరిస్థితి విషమిస్తే మరణిస్తున్నారని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు ఇప్పటివరకు మరణాలకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైన జిల్లా అధికారులు దృష్టి సారించి గ్రామంలో వ్యాధులు రావడానికి గల కారణాలను తెలుసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వైద్య నిపుణులు నీటిని పరీక్షించాలి
మా గ్రామంలో ప్రతి ఏడాది క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైన జిల్లా అధికారులు దృష్టి సారించి వైద్య నిపుణులతో గ్రామంలో తాగు నీటిని పరిక్షించాలి. వ్యాధులు రావడానికి గల అసలు కారణాలను గుర్తించాలి.
– ఆత్రం అశోక్, గ్రామస్తుడు

వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాం
మా తల్లి వవాల్‌కర్‌ గాయబాయి గత రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతుంది. అనేక ఆస్పత్రుల్లో వైద్యం చేయించాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యం ఖర్చులు భరించలేక పోతున్నాం. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. 
 – వవాల్‌కర్‌ రమాకాంత్, గ్రామస్తుడు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా