-

స్వరపేటిక తొలగించినా గీతాలాపన

15 Aug, 2018 08:48 IST|Sakshi
జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న స్వరపేటిక తొలగించిన రోగులు.. 

బంజారాహిల్స్‌ : కేన్సర్‌తో స్వరపేటిక తొలగించిన రోగులు జాతీయ గీతాన్ని ఆలపించి కోల్పోయిన గొంతును తిరిగి సాధించవచ్చనే విశ్వాసాన్ని పొందారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిలో ఆస్పత్రిలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వరపేటిక తొలగించడంతో కృత్రిమ వాయిస్‌ బాక్స్‌ అమర్చిన రోగులు తాము మాట్లాడుతున్నామన్న విషయాన్ని నలుగురికీ తెలియజేసేందుకు జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ ఆస్పత్రిలో ఇప్పటి దాకా సుమారు 200 మందికి రోగంతో స్వరపేటిక తొలగించి దాని స్థానంలో ‘టీఈపీ’ మిషన్లను అమర్చారు. ఈ సందర్భంగా ఆంకాలజీ సర్జన్స్, ఫిజీషియన్స్, స్పీచ్‌ థెరపిస్టులు ఆధ్వర్యంలో కొందరు గీతాన్ని ఆలపించారు.

ఆంకాలజీ విభాగం హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ వైద్యులు చంద్రశేఖర్‌ రావు మాట్లాడుతూ.. స్వరపేటికను తొలగించిన వారు మాట్లాడే శక్తిని కోల్పోయి దివ్యాంగులుగా జీవితం గడపాల్సి వచ్చేదని, ఇటీవల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, చికిత్సా విధానాలతో వారికి ఊరట లభిస్తోందన్నారు. స్వరపేటిక లేనివారు పాడడం కష్టమైనా వారిలో ధైర్యం నింపేందుకు ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారిగా ఇక్కడ నిర్వహించామని తెలిపారు.

మరిన్ని వార్తలు