గల్లీలో ప్రచార జోరు

21 Nov, 2018 11:18 IST|Sakshi

ఇంకా మిగిలింది 15 రోజులే

ముందంజలో టీఆర్‌ఎస్‌

కదం తొక్కుతున్న కాంగ్రెస్‌

దూసుకుపోతున్న బీజేపీ

సామాజిక న్యాయంతో బీఎల్‌ఎఫ్‌

సాక్షి, మహబూబాబాద్‌: నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. గ్రామాల్లోని గల్లీల్లో ప్రచారం హోరెత్తుతుంది. ఉదయమే నేతలు పల్లెల్లో వాలిపోతున్నారు. ఓటరును మచ్చిక చేసుకుంటున్నారు. ఏ ఒక చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రచారంలో అన్ని పార్టీల అభ్యర్థులు వేగాన్ని పెంచారు. ఇంకా ప్రచా రానికి 15 రోజులే మిగిలి ఉండటంతోఅభ్యర్థులతో పాటు, వారి కుటుంబ సభ్యులు గల్లీ ప్రచారంలో దూసుకపోతున్నారు.అన్ని పార్టీల నుంచి పార్టీల అభ్యర్థులు తేలడం, వారందరూ నామినేషన్ల వేసే ప్రక్రియ పూర్తికావటంతో ఎన్ని కల సంగ్రామంలో కీలకమైన ప్రచా రంపై నాయకులు దృష్టి సారించారు.

డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరగనుండగా, పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారాన్ని అన్ని పార్టీలు నిలిపివేయాల్సి ఉంటుంది. ప్రధాన పార్టీల తరుపున అభ్యర్థులు ఖరారు కావటంతో మిగిలిన 15 రోజుల ప్రచార సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు కార్యకర్తలతో సమావేశాలకు పరిమితమైన నాయకులు ఇప్పు డు ఇంటింటి ప్రచారంతో ఎన్నికల్లో తాడోపేడో తే ల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రస్థాయి నే తలతో బహిరంగ సభలు, రోడ్‌షోలలో స్టార్‌ క్యాం పెయిన్‌లను ప్రచార పర్వంలోకి దించి ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 

ఖరారైన ప్రధాన పార్టీల అభ్యర్థులు
మానుకోట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరుపున బలరాంనాయక్, టీఆర్‌ఎస్‌ తరుపున శంకర్‌నాయక్, బీజేపీ తరుపున హుస్సేన్‌నాయక్, బీఎల్‌ఎఫ్‌ నుంచి మోహన్‌లాల్‌ ఎన్నికల బరిలో ఉన్నా రు. అలాగే డోర్నకల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి రెడ్యానాయక్, కాంగ్రెస్‌ నుంచి రామచంద్రూనాయక్, బీజేపీ నుంచి లక్ష్మణ్‌నాయక్‌లు పోటీ పడుతున్నారు.
 ఈ సారి ప్రతీ నియోజకవర్గంలో నాలుగు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో నిలవడంతో పోరు అసక్తికరంగానే మారనుంది. 

ఓటరును ప్రసన్నం చేసుకోవడం కోసం
తమ పార్టీ గుర్తును, పార్టీ అధికారంలోకి వస్తే చేసే పనులను వివరిస్తూ ప్రచారం చేయడంతో పాటు, వినూత్న రీతిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచార రథాలను ప్రతీ గల్లీలో తిప్పుతూ నాయకులు ఆకట్టుకుంటున్నారు. సమయం తక్కువగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. మండలంలోని కీలక నేతలు, గ్రామాల్లోని పేరున్న నేతలను ముందుగా ప్రసన్నం చేసుకుంటున్నారు. వారి వల్ల గ్రామంలో ప్రచారం సులభం కావటంతో పాటు, ఓట్లు పడే అవకాశం ఉండటంతో అటువంటి వారికి గ్రామాల్లో గిరాకీ పెరిగింది.

మరిన్ని వార్తలు