కాలంతో పరుగెడుతున్న అభ్యర్థులు..

4 Dec, 2018 09:57 IST|Sakshi

సాక్షి, అచ్చంపేట: మరో నాలుగు రోజులు చెమటోడ్చి కష్టపడితే ఐదేళ్ల పాటు హాయిగా వీఐపీ హోదాలో దర్జాగా అనుభవించవచ్చు. శాసనసభలో కీలక వ్యక్తులుగా చట్టాల రూపకల్పనలో ప్రధాన ప్రాత వహిస్తూ అధికార దర్పంతో హాయిగా బతుకొచ్చు. కాలం కలిసి వస్తే మంత్ర పదవులు దక్కొచ్చు.

అలాంటి రాజకీయ జీవితం అనుభవించే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ముందుస్తు పోరులో ప్రత్యర్థుల ముందు ఎలాగైనా గెలవాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఓ పక్కా ఉష్ణోగ్రతలు పడిపోయి గ్రామాలన్నీ మంచు దప్పటి పరుచుకుని ఉంటే తెలతెల్లవారంగానే చలికి వణికుతున్నప్పటికీ అవేమి లెక్క చేయకుండా అభ్యర్థులు మరింత వేడిగా ప్రచారం వేగం పెంచారు.

ఉదయమే ఇంటి నుంచి బయలుదేరి ఎప్పడో తెల్లవారు జామున ఇంటికి చేరకుంటున్నారు. అభ్యర్థుల రోజువారి దినచర్య అత్యంత బిజీ షెడ్యూల్‌లో గడిపేస్తున్నారు. అలసట, విశ్రాంతి అనే పదాలకు చోటు లేకుండా ముందుస్తు సంగ్రామంలో మందుకు సాగుతున్నారు. 


సమయం వృథా కాకుండా.. 
రోజులో ఉన్న 24గంటల్లో ఆ రోజును సంపూర్ణగా ఉపయోగించుకునేందుకు అభ్యర్థులు తమ షెడ్యూల్‌ను ప్రతీ నిమిషం జాగ్రత్తగా ప్లాన్‌ వేస్తున్నారు. కేవలం నిద్రపోయే సమయం తప్పా... మిగతా సమయాన్ని మొత్తం ప్రచారం పర్వానికే వినియోగిస్తున్నారు. కాలంతో పరుగెడుతూ ఎన్నికల కుస్తీకి సిద్ధమవుతున్నారు.

బిజీ షెడ్యూల్‌లో అభ్యర్థులకు నెలరోజుల నుంచి కంటి నిండ నిద్రేకరువైయింది. గ్రామాల్లోని ప్రజలంతా ఉదయమే వ్యవసాయం పనులకు వెళ్లతుండడంతో వారిని కలిసేందుకు వీలైనంత త్వరగా ఇంటి నుంచి బయల్దేరుతున్నారు. ఉదయం లేనినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వేలాది మందిని ప్రత్యక్షంగా పలకరిస్తున్నారు. అభ్యర్థులు ఇంటి ముందు నెల రోజులుగా నిత్యం జనంతో కోలహాలం కనిపిస్తోంది. ఉదయం లేచే సరికే వందలాది మంది అభ్యర్థులతో మాట్లాడేందుకు క్యూలో ఉంటున్నారు.

దీంతో నిద్రలేచింది మొదలు ప్రచార తంతు ప్రారంభమువుతోంది. కింద స్థాయి నేతలతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాల్లో పరిస్థితిపై ఆరా తీసేందుకు కొంత సయమం కేటాయించాల్సి వస్తోంది. రోజు ఏదో ఒక చోటికి వెళ్లడం దినచర్యలో తప్పని సరిగా మారింది. దీంతో నియోజకవర్గ మొత్తం చుట్టి రావడం లక్ష్యంగా ఉండడంతో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతానికి తమ కార్యకర్తలను పురమాయించి ఏర్పాట్లు చేస్తున్నారు.

గ్రామాల్లో వెళ్లే రాకపోకల సమయంలోనూ వాహనాల్లో ప్రయాణం చేస్తూనే ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు పరిస్థితులపై చర్చిస్తూ సమయాన్ని పొదుపుగా వాడుతున్నారు. అలాగే చేరికలు ప్రత్యర్థి పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ప్రొత్సహించేందుకు స్థానిక లీడర్ల సాయంతో ఆ కార్యక్రమంలో ప్రతిరోజు చేరికల కోసం ప్రత్యేకంగా కొంత టైం కేటాయిస్తున్నారు.

అలాగే నియోజకవర్గంలో ఎవరైనా పార్టీ చెందిన ముఖ్య నేతలు వస్తే జనం సమీకరణలు తదితర ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం రోజులో ఎంతో కొంత సమయం కేటాయించాల్సి వస్తోంది. ఒక్కోసారి ఉదయం ఇంట్లో అల్పాహారం తీసుకుని బయల్దేరితే మధ్యాహ్న భోజనం ఎప్పుడు తినేది వేళాపాల ఉండడం లేదు.

ఒక్కోసారి రోజులో ఒకసారే మాత్రమే తిన్న రోజులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కార్యక్రమాలు అనుకున్న సమయానికి అన్ని జరగకపోతే ఆరోజంతా షెడ్యూల్‌ మొత్తం మారిపోతుంది. కొంత మంది అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కూడా సరిగా మాట్లాడలేని పరిస్థితి. ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా ఫోన్‌లో గంటల కొద్ది మాట్లాడేస్తున్నారు. 

మరిన్ని వార్తలు