చేతకాక కాంగ్రెస్‌పై నిందలా?

8 Feb, 2017 03:15 IST|Sakshi
చేతకాక కాంగ్రెస్‌పై నిందలా?

టీఆర్‌ఎస్‌పై ఎమ్మెల్యే చిన్నారెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌: ప్రాజెక్టులను పూర్తిచేయాలనే చిత్తశుద్ధిలేని, పూర్తిచేయడం చేతకాని టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌పార్టీపై నిందలే యడం తగదని మాజీమంత్రి, ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో  మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు కాంగ్రెస్‌పార్టీ వ్యతిరేకమని మంత్రి హరీశ్‌రావు అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు.

ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ల నుంచి తీసుకుంటున్న కమీషన్లకు, ముడుపులకు కాంగ్రెస్‌పార్టీ వ్యతిరేకమన్నారు. వేల కోట్లను కాంట్రాక్టర్ల నుంచి టీఆర్‌ఎస్‌ ముఖ్యులు తీసుకుంటున్నారని, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. డీపీఆర్‌తో సంబంధం లేకుండా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలను పెంచుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు