రెవెన్యూ అధికారులపై కేసులు అన్యాయం: శ్రీనివాస్‌గౌడ్‌

29 Sep, 2017 01:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాదాబైనామాలో తప్పు జరిగిందని ఓ వ్యక్తి ఫిర్యాదుతో మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో తహసీల్దార్, ఆర్డీవో, వీఆర్వోలపై పోలీసులు కేసు బుక్‌ చేయడం అన్యాయమని టీజీవో గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గురువారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. సాదాబైనామాలో పేరు మార్పు, మ్యుటేషన్లు తహసీల్దార్‌ ఆధ్వర్యంలో జరుగుతాయని.. అందులో ఏమైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకునే అధికారం ఉన్నతాధికారులకు ఉంటుందన్నారు.

కాని అంతకంటే ముందే పోలీసు అత్యుత్సాహం ప్రదర్శించి కేసులు పెట్టడం మంచిది కాదని హితవు పలికారు. చట్టప్రకారం ఫ్లెక్సీల ను తొలగించిన ఇల్లెం దు మున్సిపల్‌ కమిషనర్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిసు ్తన్నామని.. బాధ్యులపై కఠిన చ ర్యలు తీసుకోవాలని టీజీవో అ« ద్యక్షురాలు మమత డిమాండ్‌చే శారు. ఈ సమావేశంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారా య ణ, ఉపాధ్యక్షుడు సహదేవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు