-

పాఠశాలలపై దేశద్రోహ కేసులు పెడతాం : బీజేపీ నేత

20 Dec, 2019 14:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని పాఠశాలలు విద్యార్థులకు నూరిపోస్తోన్న విషయం తమ దృష్టికి వచ్చిందని అలాంటి పాఠశాలలపై దేశద్రోహ కేసులు పెడతామని బీజేపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి శుక్రవారం వ్యాఖ్యానించారు. సీఏఏపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు ఒకే రకంగా వ్యవహరిస్తున్నాయని, సీఏఏను వ్యతిరేకిస్తున్నానని కేసీఆర్‌ పత్రికా ముఖంగా చెప్పగలరా? అంటూ సవాల్‌ విసిరారు. మరోవైపు యూనియన్లను రద్దు చేయడం పట్ల కేసీఆర్‌పై మండిపడ్డారు. యూనివర్సిటీలు, జీహెచ్‌ఎంసీ, అంగన్‌వాడీ, ఆర్టీసీలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లతో కాకుండా కార్మికులతో కేసీఆర్‌ భేటీ అయ్యారని, ఇదే పద్ధతిలో కేంద్రం ముఖ్యమంత్రితో కాకుండా ఎమ్మెల్యేలతో మాట్లాడతానంటే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. యూనియన్ల రద్దు కుదరదని మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కూడా ఒప్పుకున్నాడని గర్తు చేశారు. కార్మికులపై కేసీఆర్‌ వ్యతిరేక ధోరణిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు